ప్రస్తుతం గురించి ఆలోచించి, ఉన్నసమయాన్ని చక్కగా వినియోగించుకోవడం వలన రేపటి రోజులు బాగుంటాయని పెద్దలు, శాస్త్రాలు కూడా చెపుతున్నాయి. అందులో భవిష్యత్తు తప్ప ప్రస్తుతం అనే మాట ఎవరికి గుర్తు ఉన్నట్టే లేదు. సాధారణంగా చెప్పడానికి ప్రస్తుతాన్ని ఆహ్లాదంగా గడుపుదాం అంటారే తప్ప, నిజానికి అలాంటి ఉద్దేశ్యమే ఉంటె ఉన్నదాన్ని జాగర్త చేసుకోవడంలో తనను తాను సిద్ధం చేసుకుంటాడు మనిషి. కళ్ళముందు ఉన్న భూమిని సరిగ్గా చూసుకోవడం, కాపాడుకోవడం రాలేదు గాని వీళ్లంతా ఇప్పుడు వేరే గ్రహంపైకి వెళ్లి అక్కడ జీవనం ఏర్పాట్లు చేస్తారట! ఉన్నదానిని కాపాడుకోలేని వారు రేపటికి అందిన దానిని కూడా బాగా చూసుకుంటారని నమ్మకం ఏమిటో, కొత్తదానిపై ఉన్న మోజు తప్ప ఇక్కడ మరో ఉద్దేశ్యం ఏమి కనపడటంలేదు.

మొదలు భూమినే సరిగ్గా చూసుకోదలచుకుంటే, దాని కోసం ప్రకృతి విరోధమైన అంశాలు ఇప్పటికే పక్కన పెట్టేవాళ్ళు అందరు. కానీ అలా జరగకుండా ఇంకా వాతావరణ అహేతుకమైన విషయాలే అందరు అనుసరిస్తున్నారు అంటే అదంతా నిర్లక్ష్యమే అని చెప్పాలి. ఇంత నిర్లక్ష్యం ఉన్న వీళ్లు రేపటి రోజున వేరే గ్రహాన్ని కూడా నాశనం చేయరు అనే నమ్మకం ఎలా వస్తుంది. ఇలా ఒక ప్రాంతాన్ని నాశనం చేసి మరో కొత్త ప్రాంతానికి వెళ్లే అలవాటు అదేదో జంతువుకు ఉంటుందని చిన్నప్పుడు కధలలో చెప్తుండేవారు. మనిషి కూడా అలాగే ఆలోచిస్తున్నదేమిటో! అతనికి కూడా మూలం జంతువే కదా, అందుకే జంతు లక్షణాలు ఎక్కడకు పోతాయి, అప్పుడప్పుడు అవి బయటపడి, మొత్తానికి భూమిని నాశనం చేశాయి(చేశారు).

2030 నాటికి అంగారక గ్రహం మీదకు మనిషి వెళ్ళాలట, అక్కడ నివాసం ఉండాలట. అందుకు బోలెడంత ఖర్చు అవుతుందని, దానికోసం ఇంధనం ఆ గ్రహం మీదనే ఉత్పత్తి చేసి, దానిని వాడుకోవచ్చు అనే ఆలోచన చేస్తున్నారు వైజ్ఞానికులు. అంగారకుడిపై ఫోటో బయో రియాక్టర్లు సృష్టించి, దాని సాయంతో చక్కెర అణువులను తయారు చేయడం ద్వారా రాకెట్ ఇంధనాన్ని తయారీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తద్వారా  కాస్తైనా ఖర్చు తగ్గుతుందని వాళ్ళ ఆలోచన.


మరింత సమాచారం తెలుసుకోండి: