మహిళలకు సంతోషాన్నిఇచ్చే విషయం ఏదైనా ఉందంటే అది తల్లి కావడం అనే చెప్పాలి.గర్భం దాల్చిన తర్వాత గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భిణీ మహిళలు తీసుకోవాల్సిన ఆహారం, ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు చేయకూడని పనులు గురించి వినే ఉంటారు.ఎందుకంటే ఈ సమయంలో చేసే కొన్ని పనులు కడుపులోని బిడ్డపై ప్రభావాన్ని చూపుతాయి.ఫలితంగా ప్రతీ సంవత్సరం వేలకొద్దీ పిల్లలు ఊహించని విధంగా ఎదో ఒక లోపంతో పుడుతున్నారు. దీనికి కారణం జెనిటిక్ సమస్యలు. కానీ అన్నిసార్లు జెనిటిక్ సమస్యలే ఉండవు, చాలావారకు బయట నుంచి తెచ్చుకున్న సమస్యలే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవేంటో చూడండి.




మనం మార్కెట్ నుంచి ఎటువంటి పండ్లని తెచ్చిన గాని ముందుగా బాగా కడిగి తినాలి. ముఖ్యంగా రేగుపళ్ళు, ఆపిల్, సపోటా, ద్రాక్ష లాంటి ఫలాల్లో పెస్టిసైడ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కూరగాయలు బాగా కడిగి వండుకోవాలి. ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది.ఎక్కువగా రసాయనాలు ఉపయోగించని పండ్లు, కూరగాయలు తింటే మరి మంచిది. ప్రెగ్నన్సీ సమయంలో మేకప్, హేయిర్ కలర్, బ్లీచెస్ లాంటి కాస్మోటిక్ కెమికల్స్ కి దూరంగా ఉండాలి. ఈ 9 నెలలు హంగులు, ఆకర్షణకి వెళ్ళకుండా సింపుల్ గా ఉంటే మంచిది. కాఫీ,టీ లు ఎక్కువగా తీసుకునేవారు ప్రెగ్నన్సీ సమయంలో వాటికి దూరంగా ఉండటం మంచిది. కెఫిన్ ను కడుపులో బిడ్డ తీసుకోలేదు. బిడ్డ శరీరం అప్పుడే తట్టుకునేంతగా ఎదిగి ఉండదు.




ఇది బిడ్డ ప్రాణానికి కూడా ముప్పు కావచ్చు. ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత కాఫీ, టీ లు తీసుకోకపోవడం మరీ మంచిది. వీటి వలన శరీరానికి ఐరన్ అందదు.అలాగే సిగరేట్ తాగేవాళ్ళకి దూరంగా ఉండాలి.సిగరేట్ స్మోక్ కి రెండు మీటర్ల దూరంలో ఉన్నా ఆ ప్రభావం కడుపులో ఉన్న బిడ్డపై పడుతుందట. ఇంట్లో స్మోకర్స్ ఉంటే తాగటం మానేయమని చెప్పాలి. ముఖ్యంగా భర్త స్మోకింగ్ కి దూరంగా ఉండాలి.బయటి ఫుడ్ పూర్తిగా మానెయ్యాలి. మరీ ముఖ్యంగా రోడ్డు మీద దొరికే ఆహారం. అది పానిపూరి కావచ్చు, వడా పావ్ కావచ్చు, మాసాల బజ్జీ కావచ్చు. ఇలాంటి సమయంలో బ్యాక్టీరియా ఉండే రోడ్ సైడ్ ఫుడ్ తో అస్సలు రిస్క్ తీసుకోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: