మాములుగా కార్లను కొనే వాళ్ళు ముఖ్యంగా చూసేది కంపెనీ, బడ్జెట్ తర్వాత సౌకర్యం .. ఆ తర్వాత మిగిలినవి.. అందుకే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఖరీదైన కార్లు కూడా ఉంటాయి.. అయితే ఇప్పుడు ఒక విషయం అర్థం కాలేదు.. మార్కెట్ లో రెండు బెస్ట్ కార్లు ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవడంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు.. ముఖ్యంగా టాప్ బ్రాండెడ్ కార్లు కొనాలని అనుకున్నపుడు ఆలోచనలో పడతారు... ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువగా వినపడే పేరు..హ్యుండాయ్ క్రెటా ,షారుఖ్ ఖాన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా సంస్థ నిర్దేశించింది.



ఈ కాంపాక్ట్ ఎస్ యూవీ సరికొత్త డిజైన్, న్యూ ఇంటిరీయర్ లేఔట్, అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. టర్బో పెట్రోల్, పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో వచ్చిన క్రెటాకు పోటీగా భారత మార్కెట్లో మరో కారుగా పోటీగా నిలిచింది.. ఆ కారే ఇండియా మార్కెట్ లో మరో ఇప్పుడు హల్ చల్ చేస్తుంది.కియా సెల్టోస్ ఉంది. గతేడాది విడుదలైన ఈ కారు.. లాంచ్ అయిన కొద్ది కాలంలోనే మంచి విక్రయాలు అందుకుంది. మరి ఈ రెండింటింలో ఏ కారు ప్రత్యేకతల  పరంగా కానీ, ఫీచర్స్, ధర విషయంలో బెస్ట్ ఏంటో చూద్దాం..



క్రెటా వేరియంట్ ధర రూ.16.16 నుంచి 17.2 లక్షల మధ్య ఉంది. కియా సెల్టోస్ 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా క్రెటా మాదిరే సేమ్ పవర్ ఔట్ పుటనే కలిగిఉంది. అయితే సెల్టోస్ లో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పాటు 6-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.  ఈ కియా సెల్టోస్ ధర ధర రూ.15.29 లక్షల నుంచి రూ.16.29 లక్షల మధ్య ఉంది. అదే డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ అయితే రూ.16.29 నుంచి రూ.17.29 లక్షల మధ్య ఉంది.హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ రెండు కార్లూ 1.5-లీటర్ నేచుల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ను కలిగి ఉన్నాయి.. రెండు కార్లలో ఫీచర్లు ఇంచు మించు ఒకేలా  ఉన్నాయి..ఒక ధర మాత్రం కాస్త వ్యత్యాసం కలిగి ఉంటుంది..కియా సెల్టోస్ 10వేల రూపాయలు చౌకగా దొరుకుతుండగా.. ఐవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థలో సెల్టోస్ కంటే క్రెటా రూ.85,000 అధికంగా ఉంది... ఇక కార్ల గురించి కస్టమర్ నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: