మైలవరం వైసీపలీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. పార్టీ మారొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీలో ఉన్న అతి కొద్ది మంది కమ్మ ఎమ్మెల్యేలలో వసంత కృష్ణ ప్రసాద్ ఒకరు. ఆయన ఇటీవల తరచూ పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల గుంటూరులో చంద్రబాబు కార్యక్రమంలో తొక్కిసలాట గురించి కూడా పార్టీ స్టాండ్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరావు ఎంపీ కేశినేని నాని ని కలవడంతో మరోసారి పుకార్లు షికార్లు కొడుతున్నాయి.


ఇది బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెబుతున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో వైసీపీతో విభేదిస్తున్న వసంత నాగేశ్వరావు ఇప్పుడు ఎంపీ కేశినేని నానిని కలవడం కలకలం రేపుతోంది. అమరావతి విషయంలో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వసంత నాగేశ్వరావు తన అసంతృప్తి బహిరంగంగా వెళ్లగక్కారు. అయితే.. తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో నేను విభేదిస్తున్నానని ఆయనకి నాకు సంబంధం లేదంటూ అప్పుడు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కొట్టి పారేశారు. తాజాగా ఎంపీ కేశినేని నానితో వసంత నాగేశ్వరావు భేటీ పై పలు రకాల ఊహాగానాలు వస్తున్నా.. ఈ కలయిక లో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కేశినేని నాని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

YCP