ఇతర రాష్ట్రాల వాళ్లు కేసిఆర్ ను ఒక జోకర్ లా చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. పవిత్రమైన అసెంబ్లీలో సీఎం అబద్దాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసారని.. ఆయన వ్యాఖ్యలతో అసెంబ్లీ మలినం అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సభలో కేవలం మోడీనీ తిట్టే పనే పెట్టుకున్నారని.. బడ్జెట్ మీద ఒక్క మాటా మాట్లాడలేదు...ప్రధానితో కేసిఆర్ పోల్చుకున్నరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.


అసలు సభలో లేని వ్యక్తీ గురించి మాట్లాడొచ్చా... స్పీకర్ అయినా ఆపాలి కదా అని ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఇప్పటికీ వంద సార్లు రాజీనామా చేస్తాను అన్నారని.. ఆయన మాట్లాడినవన్ని అబద్ధాలేనని అన్నారు. కేసీఆర్ అబద్దాలను నిరూపించేందుకు మేము సిద్ధం.. రాజీనామాకు నీవు రెఢీనా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. డేట్ టైం ఫిక్స్ చెయ్ .. నీవు పోతే శని పోతాదని.. కేసిఆర్ అబద్ధాలు చూసి ప్రజలు నవ్వుతున్నారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: