రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు వివాదాస్పదం అయ్యాయి. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణాలో హైకోర్ట్ నిమజ్జనం విషయంలో ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. గణేష్ నిమజ్జనం పై హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. టాంక్ బండ్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణా హైకోర్టు.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేయడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రేపు హై కోర్టు లో రివ్యూ పిటిషన్ వేయనున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతుంది. ఇక గణేష్ ఉత్సవ కమిటీ హైకోర్ట్ తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts