
అతను ఓ యువతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఇక ఆ యువతి తోనే తన జీవితాన్ని మొత్తం ఊహించుకున్నాడు. పెళ్ళి చేసుకుని హాయిగా ఉండాలి అనుకున్నాడు. కానీ ఇటీవల తాను ప్రేమించిన యువతీ తల్లిదండ్రులు ఆమెకు వేరొక సంబంధం చూస్తున్నారు అనే విషయం తెలిసి ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మనస్తాపం చెందాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలు ఇక తనకు దక్కదేమో అనుకున్నాడు. ఇక ఈ విషయాన్ని జీర్ణించుకోలేక మరణం శరణ్యం అనుకున్నాడూ. చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
నగరంలోని విష్ణు క్లాసిక్ అపార్ట్మెంట్ లో తిరుపతికి చెందిన నీరజ్ కుమార్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇక అతని కుమారుడు విశాల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఇటీవలే ఉదయం సమయంలో తండ్రి కొడుకు గదిలోకి వెళ్లగానే కొడుకు అపస్మారక స్థితిలో కిందపడిపోయి ఉన్నాడు . దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఇక ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంఘటనా స్థలంలో ఒక చీటిలో బాటిల్ ముట్టుకోకండి అందులో సైనైడ్ ఉంది అంటూ రాశాడు. అంతేకాకుండా సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ప్రేమ వ్యవహారమే ఇక ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం అన్న విషయం సెల్ఫీ వీడియో ద్వారా తెలిసింది.