ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్ట లేడు అనే ఒక సామెత ఉంది. అంటే ఇంట్లో మనిషిగా ఎంతో నమ్మకంగా ఉంటూ ఎవరైనా దొంగతనానికి పాల్పడితే చోరీకి పాల్పడింది  ఎవరు కనిపెట్టలేరు అని చెబుతూ ఉంటారు. అందుకేనేమో ఎంతోమంది నమ్మకంగా పని చేస్తున్నట్లు నటిస్తూ దొంగతనాలకు పాల్పడటం  లాంటివి చేస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో ఎంతో మంది దొంగలు ఇలాంటి రూట్ లోనే తన ప్లాన్ ని అమలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పటిలా రాత్రి సమయంలో సీక్రెట్ గా ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయడం లాంటివి మానేశారు.


 ఏకంగా ఇంట్లో పని వాళ్ళ లాగా ఎంతో నమ్మకంగా పని చేయడం ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయి అన్న విషయాలను తెలుసుకోవడం.. కొన్నాళ్ళు నమ్మకంగా పని చేసి ఇక సమయం సందర్భం చూసి అందినకాడికి దోచుకోవడం లాంటివి చేస్తున్న దొంగలే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఒక బ్యాంకు లో కూడా ఇక ఇలాంటి ఇంటిదొంగ బయటపడ్డాడు అన్నది తెలుస్తుంది. మహారాష్ట్రలోని తానే జిల్లా డోంబివాలి నగర మానువాడ శాఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఇటీవల భారీ చోరీ జరిగింది. ఏకంగా 34.20 కోట్ల రూపాయలను ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ ఘటన కాస్త  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. అయితే ఇటీవలే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



 అయితే ఈ కేసును ఎంతో సవాలుగా తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు సంరక్షకుడిగా విధుల్లో ఉన్న అల్తాఫ్ షేక్ ఈ కేసులో ప్రధాన నిందితుడు అన్నది తేలింది. ఈ క్రమంలోనే ఇతను పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అల్తాఫ్ షేక్ కి సహకరించిన హుస్సేన్ కురేషి, మహమ్మద్ రియాజ్, అహ్మద్ ఖాన్,  ప్రేమ్ శంకర్ గిరి లను కూడా అరెస్టు చేశారు పోలీసులు.. ఈ క్రమంలోనే దొంగల దగ్గర నుంచి 22 కోట్ల రూపాయలను వసూలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: