ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ అనేది ఒక భాగంగా మారిపోయింది అని చెప్పాలి . తినడం,తాగడం, ఊపిరి పీల్చుకోవడం ఎలాగో మొబైల్ వినియోగించడం కూడా ఒక అలవాటుగా ప్రతి ఒక్కరు మార్చుకున్నారు. ఇక మొబైల్ లేకుండా కనీసం నిమిషాల పాటు కూడా ఉండలేకపోతున్నాడు మనిషి. ఇలా ఆరు అంగుళాల మొబైల్ ఏకంగా ఆరడుగుల మనిషిని బానిసగా మార్చుకుని ఆడిస్తుంది అని చెప్పాలి.  కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది.


 ఈ క్రమంలోనే మొబైల్ అతిగా వినియోగించడం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలకు బారిన పడుతున్నారు ఎంతోమంది. అయితే కేవలం అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు మొబైల్ చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడటం కారణంగా కరెంట్ షాక్ కొట్టి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. మొబైల్స్ పేలిపోతున్న ఘటనలు అయితే మొబైల్ వినియోగదారులందరినీ కూడా భయపెడుతున్నాయ్ అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సెల్ఫోన్ కూ చార్జింగ్ పెట్టి స్నానం చేసేందుకు వెళ్ళగా చివరికి షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన హైదరాబాద్లోనూ చర్లపల్లిలో చోటుచేసుకుంది.


 వెంకట్ రెడ్డి నగర్ కాలనీకి చెందిన చెన్నమ్మ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్న సమయంలో చెన్నమ్మ ఆమె భర్త బయటకు వెళ్ళగా.. కొడుకు తన సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి స్నానం చేయడానికి వెళ్ళాడు. ఛార్జింగ్ పెట్టిన చోట షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయి. పొగలు రావడంతో ఏం జరిగిందని అతను బయటికి వచ్చి చూడగా మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పైప్ సిబ్బందికి సమాచారం అందించారూ. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇక అప్పటికే ఇంట్లో ఉన్న బట్టలు దుస్తులు ఆహార పదార్థాలు అన్ని మంటల్లో కాలి బూడిద అయ్యాయి. ఇక సదరు యువకుడికి స్వల్ప గాయాలు కావడం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి: