
ఘాటి సినిమా కోసం అనుష్క అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. జులై నెలలోనే రిలీజ్ చేస్తామని చెప్పిన కొన్ని కారణాల చేత మళ్లీ వాయిదా పడింది ఈ చిత్రం. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. థియేటర్లో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం తాజాగా చిత్ర బృందం ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది. ఘాటి చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని ఆగస్టు ఆరవ తేదీన ప్రకటించబోతున్నామంటూ తెలియజేశారు.
అలాగే మీ నిరీక్షణకు ముగించే సమయం కూడా ఆసన్నమైందని త్వరలో ఆమె పాలన మొదలవుతుందనే విధంగా ఒక క్యాప్షన్ ని జత చేస్తే పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఇక దీని బట్టి చూస్తూ ఉంటే ఆగస్టు ఆరవ తేదీ నుంచి అనుష్క ఘాటి సౌండ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో అనుష్క చాలా రఫ్ లుక్ లో కనిపించబోతున్నట్లు ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ , గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అనుష్క అభిమానులు కూడా ఈమె సినిమా కోసం చాలా ఎక్సైట్ ఉందని ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లుగా కనిపిస్తోంది.