మహిళలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే హఠాత్తుగా బండిమీద నుంచి వచ్చి మెడలో ఉండే బంగారు గొలుసులు లాకెళ్లిన సంఘటనలు చాలా చూస్తూనే ఉన్నాము.. కానీ ఇప్పుడు తాజాగా ఒక మహిళ ఎంపీకి కూడా ఇలాంటి సంఘటన ఎదురైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యురాలు సుధా రామకృష్ణనన్ కు ఇలాంటి చేదు సంఘటన ఎదురయ్యింది. ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్న సమయంలో తన మెడలో నుంచి చైన్ కొట్టేశారు అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.


తమిళనాడులోని మెయిలాదుతురై పార్లమెంట్ నియోజకవర్గానికి సుధా  ప్రాతినిథ్యం వ్యవహరిస్తోంది. మరో నాయకురాలు రజతితో కలిసి ఈమె చాణక్యపురంలోని ఎంబసీ సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసుల ఫిర్యాదులో తెలియజేసింది ఈ మహిళ ఎంపీ. ఈ జరిగిన సంఘటన పైన కూడా ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కూడా లేఖ రాసినట్లు తెలియజేసింది..


లేఖలో ఇలా రాస్తూ ఉదయం 6:15 నిమిషాల సమయంలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని స్కూటీతో ఎదురుగా మా ముందుకు వచ్చి తన మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయారని.. కానీ అతడు చాలా నెమ్మదిగా వస్తూ ఉండడంతో అతనిని మొదట మేము చైన్ స్నాచర్ గా అనుమానించలేకపోయామని  ఎంపీ సుధా రాసుకోచ్చింది.. చాలా బలంగా గొలుసు లాగడంతో తన మెడకు కూడా గాయాలయ్యాయని కొంత డ్రెస్ కూడా చినిగిందని కానీ కింద పడకుండా ఎలాగోలాగా ఆగిపోయాను ఆ తర్వాత తాము ఇద్దరం సహాయం కోసం చాలాసేపు ఎదురు చూసిన తర్వాత పెట్రోలింగ్ వాహనం కనిపించడంతో ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామంటూ తెలిపింది. ఇలా భద్రత కలిగిన ప్రాంతంలో కూడా ఒక ఎంపీకే ఇలా జరిగితే.. సాధారణ ప్రజల పరిస్థితి ఎలా అంటూ తెలపడమే కాకుండా ఈ ఘటనలో నాలుగు సవర్ల  గొలుసు పోగొట్టుకున్నానని లేఖలో రాసుకువచ్చింది ఎంపీ సుధా. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కావడంతో ఆమె ఢిల్లీలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: