
జూనియర్ హృతిక్ రోషన్ లు నటించిన ‘వార్ 2’ రజనీకాంత్ నాగార్జున్ లు కలిసి నటించిన ‘కూలి’ ఒకేరోజు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ రెండు సినిమాల పోటీలో విజేత ఎవరు అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. ‘వార్-2’ ట్రైలర్ కు ఊహించిన స్థాయిలో స్పందన రాలేదు. దీనితో ‘కూలి’ మూవీ పై మరింత అంచనాలు పెరిగాయి. అయితే ఆమూవీ ట్రైలర్ కు మిశ్రమ స్పందన వస్తోంది.
ఈమూవీ ట్రైలర్ లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్టైలిష్ టేకింగ్ ఎలివేషన్స్ కనిపించినా ఈ ట్రైలర్ చూసిన వారికి కథ ఏమిటో అర్థం అవ్వకపోవడంతో చాలమంది కన్ఫ్యూజ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో రజనీకాంత్ లాంటి సూపర్ హీరోను పెట్టుకుని దర్శకుడు లోకేష్ ప్రయోగాలు చేస్తున్నాడా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి.
దీనితో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతే పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు ఈమూవీ బయ్యర్లకు వస్తున్నట్లు టాక్. గత కొంత కాలంగా భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతున్నాయి. దీనితో ఏసినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫ్లాప్ అవుతుందో తలలు పండిన ఇండస్ట్రీ ప్రముఖులకు కూడ అర్థంకాని పరిస్థితి..
ఇప్పటిదాకా పెట్టుకున్న అంచనాలకు కొంచెం భిన్నంగా సాగేలా కనిపిస్తున్న సినిమా వారిని నిరాశకు గురి చేస్తుందా అనే డౌట్లు కూడా కొడుతున్నాయి. ట్రైలర్ తర్వాత సినిమాకు హైప్ తగ్గిందా అంటే చెప్పలేం కానీ.. ఉన్న హైప్‌ను పెంచేలా మాత్రం ట్రైలర్ లేదన్నది వాస్తవం.