కొద్దిరోజులే.. కేవలం కొద్ది రోజులే ..బాక్సాఫీస్ వద్ద బిగ్ వార్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది. ఒకపక్క "కూలి" మరొకపక్క "వార్ 2".. సినిమాలలో ఏది హిట్ అవుతుంది..? ఏది ఫట్ అవుతుంది..? ఏ సినిమా క్రేజీ రికార్డ్స్ ని నెలకొల్పుతుంది..? ఏ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ సంపాదించుకుంటుంది..? అనే విధంగా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు మొదలైపోయాయి. పలు పోల్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రజినీకాంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న కూలి సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో శృతిహాసన్ అదే విధంగా నాగార్జున కూడా నటిస్తూ ఉండడం సినిమాకి మరొక ప్లస్ పాయింట్ అయ్యింది.


సినిమా ప్రమోషన్స్ కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు కూలి మూవీ టీం.  అయితే కూలీతో పాటు ఆగస్టు 14వ తేదీ ఎన్టీఆర్ - హృటిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది అన్న రేంజ్ లో టాక్ వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా కియరా అద్వానీ స్పెషల్ క్యారెక్టర్ ఈ సినిమాని వేరే లెవెల్ లోకి తీసుకెళ్లబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.  అయితే వార్ 2 ప్రమోషన్స్ మాత్రం అంత హై లెవెల్ లో లేవు . అసలు టాలీవుడ్ ఇండస్ట్రీని వార్ 2 మర్చిపోయింది అంటున్నారు అభిమానులు .



ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఎంత పెద్ద హీరో అన్న సంగతి అందరికీ తెలిసిందే.  మరి తెలుగులో కూడా కలెక్షన్స్ రావాలి అంటే ప్రమోషన్స్ చేయాలి . మరి హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు  తెలుగు ఇండస్ట్రీలో ప్రమోషన్స్ చేయడం పై ప్రత్యేక శ్రద్ధ వహించలేకపోతున్నారు ..??? అనేది పిక్ క్వశ్చన్ మార్క్.  ఇప్పటివరకు సోషల్ మీడియాలో కండక్ట్ చేసిన పోల్స్ అన్నిటిలోనూ వార్ 2 కన్నా కూలి నే  ముందడుగులో ఉంది . ఒకటి రెండు కాదు లక్షల్లో ఓట్ల తేడాలో ఉంది.  దీనిబట్టి క్లియర్ కట్గా అర్థం అయిపోతుంది వార్ 2 సినిమా కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు అని.. కూలి సినిమా మాత్రమే ఈసారి క్రేజీ హిట్ అందుకుంటుంది అని మాట్లాడుకుంటున్నారు . దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ దొరకాలి అంటే కేవలం కొద్ది రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది . మరి మీరేమనుకుంటున్నారు ..? "కూలి" సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారా ..?? వార్ 2 సినిమా అభిమానులను ఆకట్టుకుంటుంది అనుకుంటున్నారా..? కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ ని తెలియజేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: