ఒక పార్లమెంటరీ హౌస్‌లో గళమెత్తే నాయకురాలు .. మరోవైపు వెండితెరపై విలన్‌గా వెలిగే నటుడు! ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు కాఫీ టాక్ నెట్టింట్లో హీటెక్కిస్తోంది. ఢిల్లీ రాజకీయం, బాలీవుడ్ కలిసే పాయింట్‌లో ఇప్పుడు పంకజ్ త్రిపాఠి – మహువా మొయిత్రా మధ్య జరిగిన ఈ ముద్దుల సంఘటన ట్రెండింగ్ టాపిక్‌గా మారింది .. "నిజంగా లేఖ రాసా.. కానీ అతను రాలేదు!" .. ఇదే మహువా మొయిత్రా చెబుతూ, ఒక టీవీ చానెల్ లైవ్ షోలో చెప్పిన మాట. అబ్బా! ఓ పార్లమెంటేరియన్ స్థాయిలో ఉండి.. ఇలా ఓ నటుడిపై తన ఫ్యాన్ క్రష్‌ను బహిరంగంగా షేర్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక తాను పంకజ్ త్రిపాఠి నటనకు పెద్ద ఫ్యాన్ అని, ముఖ్యంగా అతడు చేసిన డార్క్ షేడ్స్ పాత్రల్ని అమితంగా ఇష్టపడతానని మహువా ఎమోషనల్‌గా వెల్లడించింది .. "లేఖ రాసా, కాఫీకి పిలిచా.. కానీ రెస్పాన్స్ లేదు!" .. అంతేకాదు.. అతనికి తన భావాలను ఓ లేఖ రూపంలో పంపించానని, తాను కాఫీకి ఆహ్వానించానని కూడా చెప్పింది. కానీ పంకజ్ త్రిపాఠి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదట. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ – “నాకు చాలా సిగ్గుగా ఉంది, కానీ చెప్పాల్సిందే” అంటూ కామెంట్స్ చేసింది. అయితే మహువా స్నేహితుడైన మరో నటుడు ద్వారా త్రిపాఠితో ఫోన్‌లో మాట్లాడే అవకాశం మాత్రం దక్కిందట. కానీ ఆ టైంలో లేఖ గురించి పూర్తిగా మర్చిపోయానని పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. త్రిపాఠి క్రేజ్ మామూలు కాదు! .. పంకజ్ త్రిపాఠి నెగటివ్ షేడ్స్, రఫ్ & రాకింగ్ పాత్రల్లో కనిపిస్తూ.. 'కాలీన్ భయ్యా'గా గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, మీర్జాపూర్ లాంటి సిరీస్‌లలో భారీ క్రేజ్ తెచ్చుకున్నారు.

ఇప్పుడు మళ్లీ 2026లో రిలీజ్ కానున్న "మీర్జాపూర్: ది ఫిల్మ్" లో మరోసారి తన విలన్ అవతారాన్ని చూపించబోతున్నారు. స్ట్రీ 3, ఓ బీహార్ డ్రామాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్‌లో కూడా బిజీగా ఉన్న త్రిపాఠికి .. రాజకీయ నాయకురాలైన మహువా మొయిత్రా నుంచి వచ్చిన ప్రేమ లేఖకు రిప్లయ్ రాలేదన్నది ఇప్పుడు హాట్ టాపిక్! పబ్లిక్ క్రష్, పబ్లిక్ హార్ట్! .. ఓ మహిళా నాయకురాలు, అది కూడా పార్లమెంటేరియన్, ఇలా ఓ నటుడిపై తన అభిమానాన్ని పబ్లిక్‌గా చెప్పడమే కాదు, కాఫీకి పిలవడమే ఆశ్చర్యం. అయితే ఇది రాజకీయం – సినీ ప్రపంచం మధ్య ఉండే ఫ్యాన్ & స్టార్ బాండ్కి ఓ సీన్స్ గానే చెప్పుకోవాలి. ఇక త్రిపాఠి నుంచి నిజంగానే రిప్లయ్ వస్తే.. అది వైరల్ రిప్లైగా మారడం ఖాయం!



మరింత సమాచారం తెలుసుకోండి: