సినిమా ఇండస్ట్రీ లో కొన్ని కాంబోలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆ కాంబో హీరో , దర్శకుడు అయి ఉండొచ్చు. హీరో , నిర్మాత అయి ఉండొచ్చు. లేదా హీరో , హీరోయిన్ అయి ఉండొచ్చు. లేదా డైరెక్టర్ , నిర్మాత అయి ఉండొచ్చు. ఇలా ఏ కాంబో అయినా సరే కొన్ని కాంబోలో మంచి సినిమాలు వచ్చినట్లయితే మరోసారి ఆ కాంబోలో మూవీ రిపీట్ అయితే దానిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఈయనకు ఈ మధ్య కాలంలో బాగా కలిసి వచ్చిన హీరోయిన్లలో శ్రీ లీల ఒకరు. రవితేజ ఆఖరిగా ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది.

సాధారణంగా రవితేజ , శ్రీ లీల మధ్య వయసు తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ధమాకా సినిమాలో మాత్రం వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. వీరి కెమిస్ట్రీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకులు నుండి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సినిమాకు బీమ్స్ సిసిరిలియో సంగీతం అందించాడు. ఈ మూవీ కి ఈయన అదిరిపోయే మాస్ బీట్ ఉన్న సాంగ్స్ చాలానే ఇచ్చాడు. అందులో రవితేజ , శ్రీ లీల ఇద్దరు కూడా రెచ్చిపోయి తమ డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ లీల ఈ సినిమాలో తన డ్యాన్స్ తో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ ద్వారా కూడా ఈ సినిమా హిట్ మైలేజ్ మరింతగా పెరిగింది.

ప్రస్తుతం రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా మాస్ జాతర అనే మూవీ రూపొందుతుంది. ఈ సినిమాకు కూడా బీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఓ పాటను విడుదల చేయగా దాంట్లో రవితేజ , శ్రీ లీల ఇద్దరు డాన్స్ తో రెచ్చిపోయారు. శ్రీ లీల ఈ సాంగ్లో తన అందంతో కూడా రెచ్చిపోయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ సాంగ్ ను కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆ సాంగ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సాంగ్ కూడా మాస్ బీట్ తోనే సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్లో కూడా రవితేజ డాన్స్ తో శ్రీ లీల డ్యాన్స్ మరియు అందంతో రెచ్చిపోనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt