తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బాంబ్ పేలింది! బీఆర్‌ఎస్‌లో అంతర్గత కలహాలు ఆ పార్టీని పట్టపగలే తలకిందులుచేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌కి నాయకత్వం కోణంలో పూర్తిగా కదలికలు తగ్గిపోయాయి. అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం కాగా, కేటీఆర్ మాత్రం పార్టీ కార్యాలయం దారినైనా చూసే పరిస్థితిలో లేరు. ఇక కవిత మీద ఉన్న ఈడి కేసులు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతుండటం షాక్‌కు గురిచేస్తోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు, ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపగల సామాజికంగా బలమైన నేతలే ఈ నిర్ణయానికి రావడం పార్టీకి భారీ లాస్‌గా మారింది.

నాగర్ కర్నూల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఇటీవల బీజేపీ నేతలతో అంతర్గతంగా టచ్‌లో ఉన్నారన్న సమాచారం అధికారికంగా బయటకు వచ్చింది. తన నియోజకవర్గంలోనూ యాక్టివ్ లేకపోవడంతో, ఇక తాను పూర్తిగా బీజేపీ గూటికి వెళ్లేందుకు రెడీ అయ్యారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక మరో బాంబు పేల్చిన నేత గువ్వల బాలరాజు. తాను గత ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కోసం బరిలోకి దిగాలని ఆశపడ్డారట. కానీ పార్టీ ఒక్కసారిగా తాను పార్టీలోకి తీసుకొచ్చిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు టికెట్ ఇచ్చి తనను అవమానించిందని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కార్యకర్తలు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారట. ఇక ఆయన కూడా త్వరలోనే బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది . ప్రస్తుతం ఈ ఇద్దరే బాహాటంగా నిలిచినా, అంతర్గతంగా మరో నలుగురైదుగురు నేతలు కూడా పార్టీకి దూరం కావడమే కాకుండా, కొత్త పార్టీలతో సంప్రదింపుల్లో ఉన్నారని సమాచారం. బీజేపీ తెలంగాణలో తన బలాన్ని పెంచేందుకు ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అసలు పాయింట్ ఏమిటంటే…బీఆర్‌ఎస్ అధినేతలు ఇంకా స్పందించకపోయినా, గ్రౌండ్ రియాలిటీ మాత్రం – పార్టీ చివ‌రి దశకు చేరిపోయిందన్న మాట స్పష్టంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: