రాశి ఖన్నా.. ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌లోనూ పాపుల‌ర్ న‌టీమ‌ణి. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ 2013లో `మద్రాస్ కేఫ్` అనే హిందీ మూవీతో వెండితెరపై అడుగు పెట్టింది. ఆ మరుసటి ఏడాది `మనం` మూవీలో అతిధి పాత్రలో మెరిసిన రాశి కన్నా.. `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో దూసుకెళ్లింది. అటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.


ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దన్నర అవుతున్న, కొత్త హీరోయిన్లు గట్టి పోటీ ఇస్తున్న రాశి కన్నా మాత్రం తన ఫామ్ ను కోల్పోకుండా ముందుకు సాగుతోంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో యంగ్ స్టార్ సిద్దు జొన్నలగడ్డకు జోడిగా `తెలుసు కదా` అనే సినిమాలో యాక్ట్ చేస్తోంది. అలాగే హరీష్ శంకర డైరెక్ట్ చేస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే బంపర్ ఆఫర్ ను కొట్టేసింది. మరోవైపు బాలీవుడ్ లోనూ రెండు ప్రాజెక్ట్స్ కు సైన్ చేసింది.


ఈ సంగతి పక్కన పెడితే.. రాశి కన్నా నిజానికి హీరోయిన్ కావాలని అనుకోలేదట. గతంలో ఓ ఇంటర్వ్యూలో రాశి కన్నా తన బిగ్ డ్రీమ్ ను రివీల్ చేసింది. మొదట్లో ఈ అందాల మామ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నదట. ఆ దిశగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారట. కానీ మధ్యలో రాశి కన్నా మనసు మోడలింగ్ వైపు మళ్ళింది. దాంతో తన డ్రీమ్ ను పక్కన పెట్టిన రాశి కన్నా మోడలింగ్ లోకి ఎంటర్ అయింది. ఆపై గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చి హీరోయిన్‌గా ఎదిగింది. ఒకవేళ మోడలింగ్ పై ఆసక్తి రాకపోయి ఉంటే, హీరోయిన్ కాకుంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే తన డ్రీమ్ ను నెరవేర్చుకునే దిశ‌గా వెళ్లేదాన్ని అని రాశి కన్నా పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: