మెగాస్టార్ చిరంజీవి ఏడుపదుల వయసుకు చేరువవుతున్న అదే గ్లామర్, అదే గ్రేస్, అదే ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ సినిమాల లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కొద్ది రోజుల క్రిత‌మే మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో `విశ్వంభర` సినిమాను కంప్లీట్ చేశారు చిరు. ఇదొక సోసియో-ఫాంటసీ ఫిల్మ్‌. యూవీ క్రియేష‌న్స్ వారు అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


అలాగే ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో `మెగా 157` వర్కింగ్ టైటిల్ తో చిరంజీవిసినిమా చేస్తున్నారు. నయనతార హీరోయిన్ కాగా.. సాహో గారపాటి, సుష్మిత కొణిదెల‌ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `శివశంకర వరప్రసాద్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే మెగా 156, 157 మాత్రమే కాదు.. 158, 159 ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో ఉన్నాయి.


`వాల్తేరు వీరయ్య` వంటి సూపర్ హిట్ ను అందించిన డైరెక్టర్ బాబీతో మెగా 158 ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నారు. అదే విధంగా `దసరా` ఫేమ్‌ శ్రీకాంత్ ఓదెలతో న్యాచుర‌ల్ స్టార్ నాని నిర్మాణంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు. ఆనాడు ఈ రెండు ప్రాజెక్ట్స్ కు సంబంధించి అప్డేట్స్ రానున్నాయి. అలాగే అనిల్ రావిపూడి సినిమా నుంచి టైటిల్ అనౌన్స్మెంట్, విశ్వంభర నుంచి టీజ‌ర్ అండ్ రిలీజ్ డేట్ రావచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ న‌డుస్తోంది. అదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కి పూన‌కాలు ఖాయం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: