ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో మణిరత్నం ఒకరు. ఈయన తన కెరీర్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి , ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని దర్శకుడిగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో మాత్రం మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమాలు అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకోవడంలో అంతగా సక్సెస్ కాలేకపోతున్నాయి. ఆఖరుగా మణిరత్నం , కమల్ హాసన్ హీరోగా త్రిష హీరోయిన్గా థగ్ లైఫ్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాలో శంభు కీలకమైన పాత్రలో నటించాడు. చాలా సంవత్సరాల క్రితం కమల్ హాసన్ , మణిరత్నం కాంబోలో నాయగన్ అనే సినిమా వచ్చింది.

సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత చాలా సంవత్సరాలకి వీరి కాంబోలో మూవీ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయింది. మణిరత్నం తన తదుపరి మూవీ ని శింబు తో చేయబోతున్నట్లు కొన్ని కథనాలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు. ఇకపోతే తాజాగా మణిరత్నం నెక్స్ట్ మూవీ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మణిరత్నం తన నెక్స్ట్ మూవీ ని కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్రమ్ కుమారుడు అయినటువంటి ధ్రువ్ విక్రమ్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మణిరత్నం , ధ్రువ్ విక్రమ్ కి ఓ కథను వినిపించినట్లు , ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే మణిరత్నం  దర్శకత్వంలో నటించడానికి ధ్రువ్ విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే వీరిద్దరి కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ లో రుక్మిణి వసంత హీరోయిన్గా నటించబోతున్నట్లు కూడా ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: