టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి అదిరిపోయే రేంజ్ క్రేజ్ను సంపాదించుకున్నాడు. మహేష్ ఆఖరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మహేష్ , ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది.  ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరీర్ను కొనసాగించి , మహేష్ బాబు తో కూడా పలు సినిమాలలో నటించిన ఓ బ్యూటీ మహేష్ బాబు క్లోజ్ ఫ్రెండ్ అని , ఆయన క్లాస్మేట్ అని మీకు తెలుసా ..? ఇంతకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించి , మహేష్ బాబు సినిమాల్లో నటించి , అతని క్లోజ్ ఫ్రెండ్ మరియు క్లాస్మేట్ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని త్రిష , మహేష్ బాబుకు చాలా క్లోజ్ ఫ్రెండ్ మరియు అతని క్లాస్మేట్ కూడా. ఇకపోతే మహేష్ బాబు , త్రిష కాంబినేషన్లో మొదటగా అతడు అనే సినిమా వచ్చింది.

ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఇందులో మహేష్ బాబు , త్రిష జోడి కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సైనికుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ మూవీలోని మహేష్ , త్రిష కెమిస్ట్రీకి మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: