
కొందరు నాలుగుకి కొందరు 5కి మరికొందరు ఆరు , ఏడుకి అలారం పెట్టుకునే ఘనులు కూడా ఉన్నారు. అయితే అలారం పెట్టుకుంటే సరిగ్గా ఆ టయానికి నిద్రలేచేస్తారా అంటే నో కాదని చెప్పాలి . చాలామంది అలారం స్నూజింగ్ టైం ను ఎక్కువగా పెట్టుకుంటారు . అలారమ్ స్నూజింగ్ టైం 10 -15 -20 నిమిషాల గ్యాప్ లో మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది . అయితే అలారం మోగిన ఆఫ్ చేసి మళ్లీ నిద్రపోయే బ్యాచ్ మనలో చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ సరిగ్గా ఉపయోగపడుతుంది . ఉదయాన్నే నిద్రలేవాలి అని అనుకునేవారు ..అలారం పెట్టుకున్న టైం కు నిద్ర లేవలేక పోతున్నాను అని బాధపడేవాళ్లు కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే ఉదయమే నిద్ర లేవచ్చు అంటున్నారు డాక్టర్లు .
మరీ ముఖ్యంగా రాత్రి 7:30 - 8:00 తర్వాత స్క్రీన్ టైం పూర్తిగా ఆపేయాలి . బెడ్ పక్కన ఫోన్ అస్సలు పెట్టుకోకూడదు. బెడ్ పై పడుకున్న ఫోన్ ని చేతికి అందనంత దూరంలో పెట్టుకోవాలి. మొబైల్ లైట్ కారణంగా మన నిద్ర డ్యామేజ్ అవుతుంది అంటున్నారు డాక్టర్లు . అంతేకాదు నిద్రపోయే రెండు-మూడు గంటల ముందే ఆహారం తీసుకోవాలి . అంతేకాదు నిద్రపోయే ముందు బ్రష్ చేసుకుని ఒక గ్లాసుడు నీళ్లు తాగి రెండు నిమిషాలు అటూ ఇటూ నడిచి పడుకుంటే త్వరగా నిద్ర పట్టేస్తుందట. తద్వారా ఉదయం తొందరగా లేవచ్చు . అన్నిటికన్నా ముఖ్యంగా పడుకునే ముందు ఎటువంటి చికాకులు ప్రెజర్ తీసుకోకుండా ప్రశాంతంగా మనసుకు హాయిగా మనకు ఇష్ట దైవం శ్లోకాన్ని చదువుకొని పడుకుంటే త్వరగా నిద్ర పట్టేస్తుందట . రాత్రి స్క్రీనింగ్ టైం తగ్గించి త్వరగా తినేసి చక్కగా ఫ్రెష్ అయ్యి పడుకుంటే త్వరగా నిద్ర పడుతుంది . తద్వారా ఉదయం త్వరగా లేయచ్చు . ఇక ఈ అలారం పెట్టుకునే సమస్యలకు కూడా గుడ్ బై చెప్పొచ్చు అంటున్నారు కొంతమంది ఈ టిప్స్ ఫాలో అయిన ఫ్రెండ్స్..!!