
ఇదే టైంలో రిలీజైన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విజయ్ సినిమా ఓవర్‌టేక్ చేయలేని స్థాయిలో విశ్వాసం పొందిన హిందూ డివోషనల్ థీమ్, స్పిరిచువల్ కనెక్ట్ తీసుకువచ్చింది. శనివారం, ఆదివారం టికెట్లు దొరకక చూసిన వందల మందికి పైగా ఆదివారానికే ప్లాన్ పెట్టేసారు. దీంతో వచ్చే వీకెండ్‌లో కూడా మహావతార్ నరసింహే హవా కొనసాగే అవకాశం ఉంది.చ ఇంకా ఈ వారం పెద్ద రిలీజ్ లేకపోవడం కింగ్డమ్ టీమ్‌కి కొంత ఊరట ఇచ్చినప్పటికీ … అతడు, మురారి వంటి మహేష్ బాబు సినిమాల రీ-రిలీజ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఖలేజా రేంజ్ రెస్పాన్స్ వస్తే థియేటర్లలో కింగ్డమ్‌కు తిరుగులేని పోటీ తప్పదు.
ఇప్పటి వరకు ఉన్న ట్రేడ్ టాక్ ప్రకారం, ‘కింగ్డమ్’ సినిమా 60-70% వరకు రికవరీ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ, బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవాలంటే వీకెండ్ కీలకం. ఒకవేళ మరో 30% బిజినెస్ తీయలేకపోతే, ఫైనల్‌గా ఈ ప్రాజెక్టు కూడా లాస్‌గానే మిగిలే అవకాశముంది. ఈ నెల 14వ తేదీకి వార్ 2, కూలీలు వంటి భారీ సినిమాలు విడుదల కావడంతో, కింగ్డమ్‌కిది ఫైనల్ వీకెండ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకే … ఈ వారాంతం కలెక్షన్లు బాగా రాబడితే కొంతమేర నిలబడే అవకాశం ఉంది. లేదంటే విజయ్ దేవరకొండకి మళ్లీ ఫ్లాప్ ట్రాక్లోనే ఉండే ప్రమాదం ఎదురవుతుంది.