
అయితే జూనియర్ ఎన్టీఆర్ ని బాలీవుడ్ ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు అన్న వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. కేవలం జూనియర్ ఎన్టీఆర్ నే కాదు గతంలో ప్రభాస్ ని కూడా ఇదే రేంజ్ లో తొక్కేయాలని చూసారు బాలీవుడ్ హీరోస్ అండ్ కో అనే టాక్ వినిపించింది . జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన తాజా సినిమా వార్ 2. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ . ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .
అయితే ఈ సినిమా లో హృతిక్ రోషన్ క్యారెక్టర్ హైలెట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ని నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు . కావాలనే ఒక బాలీవుడ్ బడా స్టార్ ఫ్యామిలీ ఎన్టీఆర్ ని తొక్కేయడానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ని ఎదగనీయకుండా ఉండడానికి ఈ విధంగా చేస్తున్నారట . వార్ 2 సినిమాకి మంచి రివ్యూస్ వచ్చేలా డబ్బులు ఇచ్చి ప్లాన్ చేస్తున్నారట . కానీ ఎన్టీఆర్ ని మాత్రం ట్రోల్ చేయాలి అంటూ సపరేట్ గా ఒక టీం ని ఏర్పాటు చేసుకున్నారట . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. దీనికి తెలుగు జనాలు కూడా తిప్పికొడుతున్నారు. మా అన్న ఎన్టీఆర్ ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా ఊరుకోం.. అంతకు అంత పగ తీర్చుకుంటామంటూ వార్నింగ్ ఇస్తున్నారు..!