సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా పేరుపొందింది. దాదాపు దశాబ్ద కాలానికి పైగా స్టార్ డం పొందిన ఈమె  ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ హీరో నాగచైతన్య తో ప్రేమలో పడి చివరికి ఆయన్ని వివాహం చేసుకుంది. అలా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసిన తర్వాత వీరి మధ్య ఏం జరిగిందో ఏమో  సడన్ గా విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చేసారు. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. సమంత సినిమాలపై దృష్టి పెట్టి ముందుకు వెళుతుంటే నాగచైతన్య కూడా తన కెరియర్ పైన దృష్టి పెట్టారు. కానీ సమంత కాస్త డిప్రెషన్ లోకి వెళ్లడం వల్ల ఆమెకు ఒక మాయోసైటిస్ అనే కొత్త వ్యాధి వచ్చింది. 

దీనివల్ల సమంత చాలా దారుణంగా అనారోగ్యం పాలయ్యింది. విదేశాల్లో చికిత్స చేసుకొని కోలుకుంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లోకి మళ్లీ  రీ ఎంట్రీ ఇస్తూ దూసుకుపోతోంది. అలాంటి సమంత అంత పెద్ద వ్యాధి నుంచి బయటపడి మళ్ళీ సినిమాలకు రావడానికి కారణం ఆ ఒక్క వ్యక్తి అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే  రాహుల్ రవీంద్రన్.. ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమయంలో రాహుల్ ప్రతిరోజు సమంతా ఇంటికి వచ్చేవారట. ఆమెతో గేమ్స్ ఆడి తన వ్యాధిని మర్చిపోయేలా చేసారట.
అంతే కాదు తనకు ఎంతో సపోర్ట్ చేసి మళ్లీ సినిమాల్లోకి రావాలని కన్విన్స్ చేశారట.. ఈ విధంగా సమంత రాహుల్ వల్ల అన్ని మర్చిపోయి తన ఆరోగ్యం సెట్ చేసుకున్నానని మళ్లీ సినిమాల వైపు దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది.  ఆయన అంత బ్రతిమిలాడాడు కాబట్టే నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేశానని సమంత అన్నది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్స్ రాహుల్ రవీంద్రన్ తో సమంత ఏదో నడిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: