
ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. "నా స్వామి రంగా" సినిమాలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంది . అంతకంటే ముందే "అమిగోస్" సినిమాలో కళ్యాణ్ రామ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది . కాగా నేడు ఆషిక రంగనాథ్ పుట్టినరోజు . ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించి స్పెషల్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఆశిక్ రంగన్నాధ్ ఎంతో అందంగా ఉంటుంది అని చూడగానే చెప్పేసేయొచ్చు. దీనితో అభిమానులు కూడా ఈ పోస్టర్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఆషిక రంగనాథ్ బర్త్డ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో.. ఆషిక పూర్తిగా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తే బాగుండేది అంటూ తమ ఒపీనియన్ చెబుతున్నారు .
ఆషిక రంగనాథ్ ఇండో వెస్ట్రన్ లుక్ తరహాలో కనిపించింది . మరీ ముఖ్యంగా విశ్వంభర సినిమా అనగానే అందరూ ట్రెడిషినాలిటిని ఎక్కువగా చూస్తారు. అయితే ఆషిక రంగనాథ్ ఫోటో పోస్టర్ లో ఆమె పయట కొంగు చాలా డీప్ గా కిందకు దిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో నటిస్తున్న సినిమాలో హీరోయిన్ఆషిక రంగనాథ్ లాంటి యంగ్ బ్యూటీ ని పెట్టడం వల్ల కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి . ఇప్పుడు ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఆమె పయట కొంగుపై మరింత నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి . దీని పట్ల మెగా ఫ్యాన్స్ కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు . ఇలాంటి పోస్టర్ రిలీజ్ చేసే ముందు కొంచెం చూసుకోవాలిగా ..మా అన్న మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి వచ్చే పోస్టర్ ఏదైనా పద్ధతిగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆశికా.. చిరంజీవి పక్కన సూట్ కాకపోవచ్చు ఏమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో..??