మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో విజయాలను అందుకుంది. ఈ బ్యూటీ కి తెలుగు లో మొట్ట మొదటి విజయం హ్యాపీ డేస్ అనే సినిమా ద్వారా వచ్చింది. ఈ మూవీ లో కాలేజీ స్టూడెంట్ గా నటించిన తమన్నా తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఆ తర్వాత నుండి ఈమెకు తెలుగులో అవకాశాలు భారీగా పెరిగాయి. అందులో భాగంగా అనేక మంది స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈమె ఎన్నో విజయాలను అందుకొని ఎన్నో సినిమాలలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని అత్యంత తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అలాగే అదే రేంజ్ లో కెరియర్ను చాలా సంవత్సరాల పాటు ముందుకు సాగించింది.

ఈమె కేవలం తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను ముందుకు సాగించింది. ప్రస్తుతం తమన్నా ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినిమాలలో నటిస్తూ అదిరిపోయే రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇప్పటికే తమన్నా హిందీ లో కూడా పలు సినిమాలలో నటించింది. కానీ హిందీ లో తమన్నాకు అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాలు ఎక్కువగా దక్కలేదు. తాజాగా ఈ బ్యూటీ మరో హిందీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ... ప్రకారం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి షాహిద్ కపూర్ హీరోగా రూపొందబోతున్న రోమియో సినిమాలో తమన్నా హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ వార్త కనుక నిజం అయ్యి ఈ సినిమా మంచి విజయం సాధిస్తే తమన్నా కి హిందీ సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ దక్కే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. తమన్నా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే అనేక సినిమాల్లో ఐటమ్ సాంగ్లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను తన అందంతో , డాన్స్ తో ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: