సినిమా ఇండస్ట్రీలో ఎన్నెన్నో సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి . గతంలో తెరకెక్కిన కొన్ని సినిమాలకి సీక్వెల్స్ కూడా తెరకెక్కుతుంటాయి. రీసెంట్ కాలంలో అయితే కొన్ని సినిమాలకు సీక్వెల్స్ రావాలని ఎప్పటినుంచో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు . అందులో టాప్ పొజిషన్లో ఉండేది 7/G బృందావన కాలనీ . ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రతి మిడిల్ క్లాస్ కుర్రాడికి  బాగా కనెక్ట్ అవుతుంది . ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది అనే విషయం ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది .


2004లో తమిళంలో తెలుగులో విడుదలై బిగ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న యూత్ ఫుల్ ఎంటర్టైర్మెంట్ మూవీనే  ఈ 7/G బృందావన కాలనీ . సెల్వ  రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ - సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా ఎప్పుడు టీవీలో టెలికాస్ట్ అయినా సరే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ టిఆర్పి రేటింగ్స్ అందుకుంటుంది . ఫ్యామిలీ అంతా కూడా కలిసి కూర్చొని చూసి ఎంజాయ్ చేస్తారు.  అయితే కొన్ని కొన్ని సీన్స్ అభ్యంతకరంగా ఉన్న సినిమా కథ ఎమోషన్ అందరినీ హత్తుకుంటుంది .



ప్రస్తుతం ఈ  చిత్రానికి సీక్వెల్ రూపొందుతుంది.  ఈ విషయం అందరికీ తెలుసు . ఈ సినిమా ప్రేక్షకుల మనసును టచ్ చేసింది.  అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే కచ్చితంగా ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు అభిమానులు . స్టార్స్ ఈ సినిమా గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవడంలో సందేహం లేదు . అయితే తాజాగా ఈ సీక్వెల్ పై మేకర్స్ ఒక అప్డేట్ అందించారు . ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిపోయిందట . త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తాం అంటున్నారు మూవీ మేకర్స్. అయితే ఈ సినిమాల్లో కోలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న సూర్య - కార్తీలలో ఒకరు స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది.  మరీ ముఖ్యంగా కార్తీ ఈ సినిమాలో నటించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటుంది కోలీవుడ్ మీడియా. చూడాలి మరి 7/G బృందావన కాలనీ  2 ఏమాత్రం అభిమానులను ఆకట్టుకుంటుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: