టాలీవుడ్ కింగ్ నాగార్జున రూటు మారుస్తున్నారు. ఇన్నాళ్లు హీరోగా ప్రేక్ష‌కుల‌ను వినోదాన్ని పంచిన నాగ్ ఇప్పుడు నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవల `కుబేర` మూవీలో కీలకమైన పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాగార్జున.. ఈసారి డోస్ పెంచి `కూలీ`లో విలన్ గా మారిపోయారు. సైమన్ గా తనలోని మరో నటన కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగ‌రాజ్ తెర‌కెక్కించిన యాక్షన్ డ్రామా ఇది.


నాగార్జున, శృతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో భాగమయ్యారు. పూజా హెగ్డే స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. కళానిధి మార‌న్‌ నిర్మించిన కూలీ మూవీ ఆగస్టు 14న భారీ అంచ‌నాల నడుమ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ సినిమాను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తున్నారు. ప్ర‌మోష‌న్స్ లో వేగం పెంచారు. తాజాగా హైదరాబాద్ లో కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.


అయితే ఈ ఈవెంట్‌లో నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. `ఖైదీ చూశాక కచ్చితంగా లోకేష్ డైరెక్షన్ లో సినిమా చేయాలని అనుకున్నాను. నా కోరిక కూలీతో నెరవేరింది. నా కెరీర్ లో చాలా ప్రయోగాలు చేశా. ఎన్నో దెబ్బలు తిన్నా. విజయాలూ అందుకున్నా. రజిని చెప్పినట్టు ఎప్పుడు మంచి వాడిలానే నటిస్తే బాగుండదు. అందుకే సైమన్ పాత్రకు అంగీకరించా. లోకేష్ కథ‌ చెప్పినప్పుడు నా పాత్ర ఓ హీరో అనిపించింది. డౌట్ వ‌చ్చి రజిని సార్ నిజంగా ఈ కథ ఒప్పుకున్నారా? అని అడిగాను. లోకేష్ కథను చాలా మంచిది డెవలప్ చేశాడు. నా ఇన్నేళ్ల కెరీర్ లో ఫ‌స్ట్ టైమ్ కథను రికార్డ్ చేసి ఇంట్లో మళ్ళీ మళ్ళీ విన్నాను. స్టోరీని లోకేశ్‌ డెవలప్‌ చేసిన విధానం నాకు ఎంత‌గానో న‌చ్చేసింది` అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: