సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా కూలీ అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తెలుగు స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున విలన్ పాత్రలో నటించాడు. నాగార్జునమూవీ లో విలన్ పాత్రలో నటించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే హిందీ సినీ పరిశ్రమలో స్టార్ నటులలో ఒకరు అయినటువంటి ఆమీర్ ఖాన్ ఈ మూవీ లో చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక ఈయన ఈ సినిమాలో క్యామియో పాత్రలో నటించడంతో ఈ మూవీ పై హిందీ భాషలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నటించడం , లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా ఈ సినిమాపై చాలా ప్రాంతాల్లో అదిరిపోయే రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్న సందర్భంగా ఈ మూవీ కి ఓవర్సీస్ నుండి భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులు మిగిలి ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ ద్వారానే 11 కోట్ల కలెక్షన్లను  రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ రేంజ్ లో ఈ సినిమా ఫ్రీ సెల్స్ ద్వారానే కలెక్షన్లను రాబడుతూ ఉండడంతో ఈ మూవీ కి గనుక హిట్ టాక్ వచ్చినట్లయితే ఓవర్సీస్ లో ఈ మూవీ కలెక్షన్ల ఊచకోత కాయడం ఖాయం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో ... ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: