
ఆహారంలో, వేడి వేడి చికెన్ లేదా వెజిటబుల్ సూప్‌లు తీసుకోవడం మంచిది. ఇవి తేలికగా జీర్ణమై శరీరానికి పోషకాలను అందిస్తాయి. వీటితో పాటు మృదువైన అన్నం, కిచిడీ, ఓట్స్, గోధుమ రవ్వ ఉప్మా వంటివి తీసుకోవచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి.
పండ్లలో అరటి పండ్లు, పుచ్చకాయ, ఆరెంజ్ వంటివి తినడం మంచిది. వీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అల్లం, వెల్లుల్లి, పసుపు వంటివి జ్వరం సమయంలో ఎంతో సహాయపడతాయి. పసుపు పాలు తాగడం వల్ల శరీరానికి వెచ్చదనం లభించి, త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
జ్వరం వచ్చినప్పుడు భారీగా ఉండే, వేపుడు పదార్థాలు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి జీర్ణక్రియను భారంగా మార్చి, శరీరానికి మరింత అలసట కలిగిస్తాయి. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా జ్వరం నుంచి త్వరగా కోలుకోవచ్చు. జ్వరం వచ్చిన సమయంలో ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు