తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన తన సినీ కెరియర్ను మొదలు పెట్టాక చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఇక ఈయన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు మూవీ ద్వారా హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. దానితో ఈయన క్రేజ్ ఒక్క సారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో భారీగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ జూలై 31 వ తేదీన విడుదల అయింది. భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించగా ... సత్యదేవ్ మూవీ లో విజయ్ దేవరకొండ కు సోదరుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే విజయ్ దేవరకొండ ఇప్పటికే అదిరిపోయే రేంజ్ లో తన నెక్స్ట్ మూవీల లేనప్ ను సెట్ చేసుకున్నాడు. ఈయన చేతిలో ప్రస్తుతం చాలా క్రేజీ సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఏ సినిమాలో నటించబోతున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం. ఇప్పటికే విజయ్ దేవరకొండ తనకు టాక్సీవాలా మూవీ తో మంచి విజయాన్ని అందించిన రాహుల్ సంకృతీయన్  దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. అలాగే రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే సినిమాలో విజయ్ హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఈ మూవీలతో పాటు కింగ్డమ్ మూవీ కి కొనసాగింపుగా కింగ్డమ్ 2 మరియు కింగ్డమ్ 3 సినిమాలు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా విజయ్ దేవరకొండ తన తదుపరి నాలుగు మూవీలను ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd