
ఈ ఫోటోలలో ఎన్టీఆర్ చాలా బక్కచిక్కినట్లు కనిపించడంతో, ఆయన లుక్స్ విషయంలో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 'వార్ 2'లో ఎన్టీఆర్ లుక్స్ బాగున్నప్పటికీ, ఈ ఫోటోషూట్లో ఆయన ఎందుకిలా ఉన్నారో అర్థం కావడం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.
సాధారణంగా తన ప్రతి సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సరికొత్త లుక్తో కనిపించే ఎన్టీఆర్, ఈసారి ఇలా కనిపించడం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. ఈ ఫోటోషూట్ దుబాయ్లో జరిగిందని, ఇది ఆయన కెరీర్లోనే మొదటి మ్యాగజైన్ కవర్ అని తెలుస్తోంది. అయితే, అభిమానులు మాత్రం ఆయన లుక్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
'వార్ 2'లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. డ్రాగన్ సినిమాలోని పాత్ర కోసం ఆయన ఇలా సన్నగా మారారా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. తారక్ లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఆ ప్రభావం తారక్ కెరీర్ పై కూడా పడే అవకాశం ఉంది. దేవర విషయంలో రాని విమర్శలు తారక్ కొత్త సినిమాల విషయంలో వస్తుండటం కొసమెరుపు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు