
ఆగష్టు నెల 9వ తేదీన మహేష్ నటించిన అతడు సినిమా రీరిలీజ్ కానుండగా ఈ సినిమాపై ఆ సినిమా ప్రభావం సైతం కొంతమేర పడిందని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలు కింగ్ డమ్ మూవీ కలెక్షన్లు తగ్గడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యాయి. అతడు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. సెకండ్ వీకెండ్ లో కింగ్ డమ్ దూకుడుకు ఈ సినిమా బ్రేక్ వేయనుందని చెప్పవచ్చు.
విజయ్ దేవరకొండ తర్వాత సినిమాలతో నెక్స్ట్ లెవెల్ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకొని మరిన్ని సంచలనాలను క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. యూత్ లో ఈ హీరోకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు