ఏపీ రాజకీయాల్లో ఓ మాట ప్రస్తుతం గ‌ట్టిగా వినిపిస్తోంది – జగన్ జైలుకు వెళ్తారు! ఇది ఒక జోక్ కాదు .. ఒక పుకారు కాదు.. ఓ బలమైన ప్రచారం! నాలుగు అయిదు నెలలుగా బలంగా నడుస్తోంది. అసలు లిక్కర్ స్కాం పేరుతో వైసీపీ నేతలపై ఎఫ్‌ఐఆర్లు మొదలైనప్పటి నుంచే జగన్ మీద దృష్టి కేంద్రీకృతమైంది. మొన్న మిధున్ రెడ్డి అరెస్ట్ .. రేపు ఎవరు అన్న చర్చ మధ్యన “జగనే మిగిలాడు” అనే టాక్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. బీజేపీ రాష్ట్ర నేతలు కట్ ది కేక్ చెప్పేస్తున్నారు – “జగన్ అరెస్ట్ ఖాయం!” అంటూ నిత్యం మీడియా మైకులో గట్టిగా ప్రకటిస్తున్నారు. కొత్త బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ అయితే మరో అడుగు ముందుకెళ్లి “జగన్ తప్పించుకోవడం వల్ల కాదు, కేసుల బలం వల్లే ఆయన అరెస్ట్ అవుతారు” అంటున్నారు. అలాగే కేంద్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఇదే స్టేట్‌మెంట్‌ తో హీటు పెంచారు.

టీడీపీ నేతలు అయితే ఇదే డైలాగ్‌ను పెద్ద స్క్రీన్‌లో ప్లే చేస్తున్నారు. “లిక్కర్ స్కాం బిగ్ బాస్ జగన్” అంటున్నారు. ఇది కేవలం ఖజానాకు నష్టం కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటం అని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పక్కనే కాంగ్రెస్ కూడా టచ్ ఇవ్వడం విశేషం. మాణిక్కం ఠాగూర్ సైతం జగన్ మీద చిచ్చు పుట్టించారు – “ఒక సీఎం ఐదు ఏళ్లు స్కామ్‌లోనే గడిపారా?” అంటూ ఫైర్ అయ్యారు . ఇంత హైప్ మిడ్ లో వైసీపీ నేతలు మాత్రం కంటిని కాల్చేస్తున్నారు. “ఇది రాజకీయ కుట్ర, జగన్ చుట్టూ ఉచ్చు బిగించేందుకు కూటమి ఎత్తుగడలు వేస్తోంది” అంటున్నారు. శిల్పా రవి వంటి నేతలు కూటమి తీరు ప్రజల్లో అసహనం పెంచుతోందంటూ గగ్గోలు పెడుతున్నారు.

అయితే అసలైన పాయింట్ ఏంటంటే – “జగన్ అరెస్ట్ ఎప్పుడు?” ఈ ప్రశ్న మే నుంచి ఇప్పటి వరకు వినిపిస్తోంది. రోజులు మారుతున్నా, ఆ ప్రశ్న మాత్రం మారడం లేదు. కానీ ప్రస్తుతం వినిపిస్తోన్న సమాచారం ప్రకారం – సిట్ వద్ద  బలమైన ఆధారాల జాబితా ఉంది. ఒక్కసారి అరెస్ట్ అయితే – తిరిగి బయటకు రావడం అంత ఈజీ కాదంటున్నారు. ఏదేమైనా.. జైలుకెళ్తే జగన్ అనే మాట ఇప్పుడు ఫిల్మీ డైలాగ్‌లా మారిపోయింది – కానీ ఈసారి ఆ డైలాగ్ కు క్లైమాక్స్ కూడా ఉండేలా కనిపిస్తోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: