
మరి ముఖ్యంగా వెంకీ సినిమాలో స్నేహ - రవితేజల పెర్ఫార్మన్స్ రిపీట్ అవ్వాలి అంటే మాత్రం రవితేజ - రష్మిక మందన్నా జత కట్టాల్సిందే . ఒక డైరెక్టర్ మాత్రం వీళ్ళిద్దరిని తెరపై చూపించడానికి చాలా సహసాలే చేశాడు . కానీ రష్మిక మందన్నా మాత్రం అందుకు ఒప్పుకోలేదు . రిజెక్ట్ చేసేసింది . ఆ సినిమా మరేంటో కాదు "ధమాకా". త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన సినిమానే ఈ ధమాకా . ఈ సినిమా కథపరంగా కంటెంట్ పరంగా మాస్ ఎలివేషన్స్ పరంగా మ్యూజిక్ పరంగా అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునింది .
మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికి కూడా జనాలు విని ఎంజాయ్ చేస్తూ ఉంటారు . ఈ సినిమా 100 కోట్లు క్రాస్ చేసింది. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా రష్మికను అనుకున్నారట త్రినాధరావు నక్కిన . కానీ ఆమె వేరే మూవీ కి కాల్ షీట్స్ ఇచ్చేసిన కారణంగా ఈ మూవీ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. అయితే ఆ టైంలో రవితేజ తో నటించడం ఇష్టం లేక రిజెక్ట్ చేసిందన్న టాక్ బయటకు వచ్చింది. నిజా నిజాలు ఏంటో తెలియదు కానీ వీళ్ళిద్దరి కాంబోలో మాత్రం సినిమా మిస్ అయిపోయింది . సెట్ అయ్యి ఉంటే బాగుండేది అంటున్నారు అభిమానులు. చూడాలి మరి వీళ్ళ కాంబో మళ్లీ ఎప్పటికీ సెట్ అవుతుందో..???