
మన అందరికి తెలిసిందే తారక్ కి ఇద్దరు కొడుకులు . భార్గవ్ రామ్ - అభయ్ రామ్ ..ఇద్దరు కూడా చాలా అల్లరి అల్లరిగా చలాకిగా ఉంటారు . నాన్న పోలికలు అచ్చుగుద్దినట్లు దిగిపోయారు . అయితే పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ వచ్చిన సరే అభయ్ రామ్ - భార్గవ్ రామ్ లని తెరపై చూపించడానికి ఒప్పుకోలేదు జూనియర్ ఎన్టీఆర్ . ప్రజెంట్ వాళ్ళు చదువుకునే ఏజ్ లోనే ఉన్నారు . అప్పుడే సినిమాలోకి దింపడం ఇష్టం లేదు అంటూ తేల్చి చెప్పేసారట .
అంతేకాదు ఎవరు నీ కొడుకులని హీరోలుగా చూడవా..? అని అడిగిన.." నా కొడుకులు హీరోలు అవ్వడం కన్నా కూడా బాధ్యతగల వృత్తిలో డాక్టర్ గా నలుగురికి సేవ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను " అంటూ బంధువులకి చెప్పుకొస్తారట. జూనియర్ ఎన్టీఆర్ కూడా పవన్ కళ్యాణ్ లాగానే ఆలోచిస్తున్నాడు అంటున్నారు అభిమానులు, పవన్ కళ్యాణ్ కూడా తన కొడుకు ఏం అవ్వాలి అనుకుంటున్నాడు పూర్తిగా అతని ఇష్టానికి వదిలేశారు . అంతేకాదు నలుగురికి సేవ చేయగలిగితే చాలు అంటూ ఎన్నో సందర్భాలలో గుర్తు చేసుకున్నారు . మరో పవన్ కళ్యాణ్ లో ఆలోచిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ జనాలు జూనియర్ ఎన్టీఆర్ ని ప్రశంసించేస్తున్నారు..!