దేవుడు అందరికి అన్ని ఇవ్వడు అని అంటూ ఉంటారు కొందరు. కొందరికి కొన్ని ఇస్తే కొన్ని వదిలేస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్ళు . చాలామంది హీరోయిన్స్ ని కూడా కొంతమంది జనాలు ఇదేవిధంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అలాంటి కామెంట్స్ తో బాగా ట్రోల్ అయిన బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా శ్రీ లీలా అని చెప్పుకోవాలి.  శ్రీ లీల పేరుకి ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయో అన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి .


శ్రీ లీల అందం.. ఆమె డాన్స్.. ఆమె నటన అభిమానులకి బాగా నచ్చేస్తుంది . చక్కగా మాట్లాడుతుంది . అందరితో జోవియల్ గా మూవ్ అవుతుంది . పర్ఫెక్ట్ గా ఉండే శ్రీలీల కి మాత్రం ఒకే ఒక్కటి మైనస్ గా మారింది అంటున్నారు జనాలు ...సినీ ప్రముఖుల కొంతమంది . అయితే ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ మాట్లాడుతున్నారు జనాలు. చాలా చక్కగా అందంగా ఉండే శ్రీలీలకి  హైట్ మాత్రం దేవుడు ఇవ్వలేకపోయాడు అని మాట్లాడుతున్నారు. ఇంకొంచెం హైట్ ఆ దెవుడు శ్రీలీల కి ఇచ్చి ఉంటే శ్రీలీల చాలా చక్కగా ఉండేది అని ..ఇండస్ట్రీలో పొడుగ్గా ఉన్న స్టార్స్ పక్కన నటించగలిగేది అని మాట్లాడుకుంటున్నారు.

 

అప్పుడు ఆమె ఇండస్ట్రీలో ఇంకా మంచి స్థానాన్ని అందుకొని ఉండేది అని ..ఒకప్పుడు ఇండస్ట్రీలో సౌందర్య ఎంత మంచి పేరు సంపాదించుకుందో అలాంటి ఒక మంచి పేరు సంపాదించుకుని .. టాలెంట్ ఉన్న నటి శ్రీ లీలా అనేది అంటూ మాట్లాడుకుంటున్నారు . నిజమే చాలామంది స్టార్ హీరోస్ శ్రీ లీలను తమ సినిమాలో పెట్టుకోకుండా ఉండడానికి కారణం హైటే. హీరోస్ ఏమో తాటి చెట్టు అంత పొడుగు ఉంటారు. శ్రీలీల ఏమో కొంచెం పొట్టి . ఆ కారణంగానే వాళ్లకు మ్యాచ్ అవ్వదేమో అన్న భయంతో శ్రీలీలను కొంతమంది స్టార్స్ దూరం పెట్టారు . వాళ్లల్లో హీరో ప్రభాస్ కూడా ఉండడం గమనార్హం. నిజానికి "రాజా సాబ్" సినిమాలో ముందుగా హీరోయిన్ గా శ్రీ లీల అని అనుకున్నారట . కానీ హైట్ కారణంగా ప్రభాస్ - శ్రీలీలని వద్దు అన్నారట. పాపం అన్ని చక్కగా ఉన్న శ్రీలీలకి ఆ హైటే బిగ్ మైనస్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: