ఆండర్సన్ టెండూల్కర్ టెస్ట్ సిరీస్ లో భారత్ సాధించిన ఘన విజయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. టీమిండియా ఐదో టెస్ట్ మ్యాచ్ తో పాటు ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడం గమనార్హం. ది ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఇండియా టెస్ట్ క్రికెట్ హిస్టరీలో మాత్రమే కాకుండా టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి పెంచే విధంగా అద్భుతమైన మ్యాచ్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.

టీమిండియా కేవలం ఆరు పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో విజయం సాధించడం కొసమెరుపు.  క్రికెట్ అభిమానులు ఆనందించేలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ టెస్ట్ మ్యాచ్  వీక్షించే వాళ్లకు సైతం ఎంతో  ఆనందాన్ని కలిగించింది. భారత్ బౌలర్లు చేసిన మ్యాజిక్ వల్లే ఈ విజయం సాధ్యమైందని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  ఆండర్సన్ టెండూల్కర్ కేవలం  28 పరుగుల వ్యవధిలో ఏకంగా  నాలుగు వికెట్లను పడగొట్టడం ద్వారా  ఆండర్సన్  టెండూల్కర్ ట్రోఫీని సమం  చేయడం జరిగింది.

ఎవరూ  ఊహించని విధంగా అద్భుతం చేసి టీమిండియా బౌలర్లు అందరినీ ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందని అందరూ  భావిస్తున్న తరుణంలో అట్కిన్ సన్ ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా సిరాజ్ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.   తొలి  ఇన్నింగ్స్ లో  నాలుగు వికెట్లను తీసిన సిరాజ్  రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను తీసి ప్లేయర్ ఆఫ్ ది  మ్యాచ్ గా నిలిచారు.

ఈ మ్యాచ్ లో సిరాజ్ ప్రదర్శన గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. బుమ్రా జట్టులో లేని సమయంలో  సిరాజ్, ప్రశిడ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశారు.  భారత బౌలర్లు మన దేశానికి అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.  మ్యాచ్ చేజారిపోతుందని  భావిస్తున్న తరుణంలో టీమిండియా పుంజుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: