
జాన్వీకపూర్ సీన్స్ కూడా పెద్దగా హైలైట్ గా మారలేకపోయాయి. దీంతో జాన్వి కపూర్ తన ఆశలన్నీ కూడా పెద్ది సినిమా పైన పెట్టుకుంది. ఈ సినిమా కోసం చరణ్ కూడా అంతే కష్టపడుతూ ఉండడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్ సినిమాకి హైలైట్ గా మారిపోతుంది అంటున్నారు మేకర్స్ . బుచ్చిబాబు సనా చాలా పకడ్బందీగా కేర్ఫుల్ రామ్ చరణ్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో ఆ విధంగా తెరకెక్కిస్తున్నారట ఈ మూవీని. అయితే ఇప్పుడు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పై పెద్ద దుమారమే రేగుతుంది .
ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఏ బ్యూటీని పెట్టాలి అంటూ రకరకాలుగా మేకర్స్ చర్చించుకొని ఫైనల్లీ శ్రీలీలను ఓకే చేశారట . ఆల్రెడీ శ్రీలీల పుష్ప2 సినిమాలో "దెబ్బలు పడతయ్ రాజా" అంటూ స్పెషల్ సాంగ్ లో చిందులు వేసింది. ఇక రీసెంట్ గా జూనియర్ సినిమాలో "వైరల్ వయ్యారి" పాటతో మరోసారి తన నటన , డాన్సింగ్ స్టైల్ ను అభిమానులకు రుచి చూపించింది. ఇప్పుడు "పెద్ది" సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది . ఒకవేళ అదే అయితే మాత్రం కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కి పెద్ది సినిమా బిగ్ రాడ్ దించేస్తుంది అంటున్నారు ప్రముఖులు .
అల్లు అర్జున్ పక్కన శ్రీలీల సూట్ అయినంత విధంగా చరణ్ పక్కన సూట్ కాకపోవచ్చు శ్రీ లీల అన్న విధంగా మాట్లాడుకుంటున్నారు జనాలు. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ స్పెషల్ సాంగ్స్ చేయడం వల్ల శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అంటూ హెచ్చరిస్తున్నారు. బుచ్చిబాబు సనా ఈ ప్లేస్ లో వేరే హీరోని తీసుకొస్తే పాట ఇంకా హైలైట్ అవుతుందేమో అంటూ సజెస్ట్ చేస్తున్నారు. పెద్ది సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్ చేయకపోవడమే రామ్ చరణ్ కి పెద్ది సినిమాకి ..శ్రీలీల కెరీర్ కి మూడింటికి ది బెస్ట్ అంటున్నారు . చూడాలి మరి శ్రీలీల ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో..? బుచ్చిబాబు సనా ఇకనైనా పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం వేరే బ్యూటీని చూస్ చేసుకుంటే బెటర్ అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!