ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ‘మహావతార్ నరసింహ’ గురించి మాట్లాడుకుంటున్నారు. వర్కింగ్ డేస్ లో కూడ ఈసినిమాకు టిక్కెట్స్ దొరకని పరిస్థితి. దీనితో ఈసినిమా ఇలాంటి ఘన విజయం ఎలా సాధించగలిగింది అన్న చర్చలు జరుగుతున్నాయి. పూర్తి గ్రాఫిక్స్ మాయాజాలంతో నటీనటులు లేకుండా కేవలం టెక్నాలజీని నమ్ముకుని తీసిన ఈమూవీ ఘనవిజయం ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ పెను మార్పులకు సంకేతం అవుతుందని అంచనాలు ఉన్నాయి.


కన్నడ ఫిలిమ్ ఇండస్ట్రీలో గత నెల జూలై 25న ఈమూవీతో పోటీగా విడుదలైన ‘సు ఫ్రమ్ సో’ ఈవారం విడుదల కాబోతోంది. మూడు కోట్ల పెట్టుబడితో నిర్మించ బడ్డ ఈమూవీ 40 కోట్ల కలక్షన్స్ రాబట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బుక్ మై షో యాప్ లో కన్నడ సినిమాల పరంగా ఇప్పటిదాకా టాప్ లో ఉన్నవి ‘దర్శన్ కాటేరా’ ‘సుదీప్ మ్యాక్స్’ వాటి తర్వాతి స్థానంలో ‘సు ఫ్రమ్ సో’ ఉండటం అత్యంత ఆశ్చర్యంగా మారింది.  


బెంగళూరు లాంటి నగరాల్లో ఆదివారం ఉదయం ఆరు గంటలకు షోలు వేస్తున్నా హౌస్ ఫుల్స్ పడటంతో ఈసినిమాను తెలుగులో కూడ డబ్ చేస్తున్నారు. ఇక ఈసినిమా కథలోకి వెళితే ఒక పల్లెటూరి కుర్రాడికి సులోచన అనే దెయ్యం పడుతుంది. అక్కడి నుంచి సరదా సంఘటనలతో ఆద్యంతం వినోదాత్మకంగా ఈసినిమాలోని సీన్స్ ఉంటాయి.  


ఎలాంటి బూతులు లేకుండా కేవలం నవ్వించడమే టార్గెట్ గా కొత్త దర్శకుడు జెపి తుమినాధన్ ఈమూవీ ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆగష్టు 14న ‘వార్ 2’ ‘కూలి’ వస్తున్నప్పటికి ఆరెండు సినిమాల మ్యానియాను లెక్కచేయకుండా విడుదల అవుతున్న ఈచిన్న సినిమా కూడ సూపర్ సక్సస్ అవుతుందా అన్న అంచనాలు ఉన్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అవుతున్న కొన్ని చిన్న సినిమాల సూపర్ సక్సస్ ను చూసి టాప్ డైరెక్టర్లు కూడ షాక్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: