
విజయవాడ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఎంపీ కేశినేని శ్రీనివాస్ (చిన్ని), ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మధ్య విబేధాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మొదటిగా, ఎంపీ ప్రోటోకాల్‌ను ఎమ్మెల్యే వర్గం పట్టించుకోవడం లేదని, ముఖ్యమైన సభలు, కార్యక్రమాలకు ఎంపీని ఆహ్వానించలేదన్నది ఎంపీ వర్గం వాదన. అదే సమయంలో ఎంపీ అనుచరులు సెంట్రల్ నియోజకవర్గంలో చేపడుతున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యే వర్గానికి సమాచారం ఇవ్వకపోవడం రెండో వైపు వాదన. ఇటీవల “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని సెంట్రల్‌లో ఎంపీ వర్గానికి చెందిన నేతలే నిర్వహించడం, అందులో ఎమ్మెల్యేని పిలవకపోవడం పార్టీలో అంతర్గతంగా కలకలం రేపింది. దీనిపై స్పందించిన ఎంపీ అనుచరులు – “మీరు ఎలానూ రావడం లేదు, అధిష్ఠానం ఆదేశాల మేరకే కార్యక్రమం నిర్వహించాం” అని సమాధానం ఇవ్వడం ఎమ్మెల్యే వర్గంలో మరింత అసంతృప్తిని కలిగించిందని టాక్ ? ఎంపీ అనుచరులు నియోజకవర్గంలో పెత్తనం చేస్తుండటం, ముఖ్యమైన నిర్ణయాల్లో ఎమ్మెల్యే వర్గాన్ని పక్కనపెట్టడం — ఇవన్నీ రెండు వర్గాల మధ్య గ్యాప్ బాగా పెంచుతున్నాయి.
“ మా నియోజకవర్గంలో మీ ఆధిపత్యం ఎందుకు ? ” అంటూ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గం ప్రశ్నించగా, ఎంపీ వర్గం మాత్రం “ గత ఎన్నికల్లో సెంట్రల్‌లో మేము కలిసి ప్రచారం చేశాం. అందుకే కార్యక్రమాలు నిర్వహించడం తప్పా ? ” అని కౌంటర్ సమాధానాలు ఇస్తున్నారట. ఈ విభేదాల నేపథ్యంలో, విజయవాడలో టిడిపి పలుచనయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నేతల మధ్య ఐక్యత లేకపోతే, స్థానిక నాయకత్వం బలహీనపడుతుంది. ఇక పార్టీ అధిష్ఠానం ఈ విభేదాలను సమర్థంగా పరిష్కరించి, మళ్లీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య సమన్వయాన్ని నెలకొల్పకపోతే రాబోయే రోజుల్లో లోకల్ ఎన్నికలపై ప్రతికూల ప్రభావం తప్పదన్నది విశ్లేషకులు మాట.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు