సాధారణంగా సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఎక్కువగానే ఉంటాయి. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ అయినటువంటి హీరోయిన్స్ లో తమన్నా కూడా ఒకరు.  అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి రాజకీయ నాయకులతో బిజినెస్ మాన్ లతో సంబంధాలు ఉండడం చాలా కామన్. అయితే ఎలాంటి వివాదం లేని  నాయకులతో సంబంధాలు ఉంటే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కాం లో ప్రధాన సూత్రధారి అయినటువంటి ఓ నాయకుడితో తమన్నాకు దగ్గరి సంబంధాలు ఉన్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరయ్యా అంటే  వెంకటేష్ నాయుడు. 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడు,  సన్నిహితుడు ఈ వెంకటేష్ నాయుడు. లిక్కర్ స్కాం కేసులో ఈయన పేరు ప్రధానంగా బయటకు వచ్చింది. అయితే వెంకటేష్ నాయుడిని అనుమానించేవారు కాదు కానీ, నోట్లు లెక్కిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా సినీ ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు వినిపించాయి. అంతేకాకుండా తమన్నా ఈ వ్యక్తితో స్పెషల్ ఫ్లైట్ లో కలిసి ప్రయాణిస్తున్న కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇంకేముంది తమన్నాకి వెంకటేష్ నాయుడితో ఏదో సంబంధం ఉందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

మరి వీళ్ళు ఏ సమయంలో కలిసి ప్రయాణించారో తెలియదు కానీ వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు  నెటిజన్స్. ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మ తో విడిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటినుంచి ఆమె  వెంకటేష్ నాయుడుకి దగ్గర అయ్యారంటూ  సోషల్ మీడియా లోని ఓ వర్గం వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి తమన్నాకు వెంకటేష్ నాయుడికి ఎలాంటి సంబంధం ఉందో తెలియాలి అంటే తప్పకుండా తమన్నా స్పందించాల్సిందే అంటున్నారు లేకపోతే ఈ రూమర్స్ మరింత ఊపందుకుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: