
అయితే ఈ ఘటనలో మాత్రం ఎవరికీ కూడా ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదట. కానీ ఆ వాటర్ ట్యాంకు ఉన్న తీరు చూసి ఆందోళన చెందుతున్నారు. హైదరాబాదులో చాలా ప్రాంతాలలో నాలాల పైన ఇలాగే రోడ్లు ఉన్నాయని తెలియజేస్తున్నారు. వాటి పరిస్థితి తెలుసుకొని అక్కడ ప్రజలు కూడా భయపడుతున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్న ఈ రోడ్డు కుంగి పోవడంతో వాటర్ ట్యాంకర్ నాలాలో పడిపోయింది.
నీటితో వెళుతున్న ఈ వాటర్ ట్యాంకర్ నాలాలలో చిక్కుకుపోవడంతో వెంటనే డ్రైవర్ తన ప్రాణాలను దక్కించుకోవడం కోసం అక్కడ నుంచి దూకేశారట. అయితే ఈ క్రమంలోనే ఈ ఘటన స్థలం వద్ద కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయినట్లుగా సమాచారం. సిటీ నడిబొడ్డున అందులో బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడం చేత ఇలాంటి ఘటనలు తరచూ ఏరియాలలో ఎక్కువగా జరుగుతున్నాయి అంటూ జనం తెలుపుతున్నారు. దీంతో వెంటనే అధికారులు జిహెచ్ఎంసి కి సమాచారం అందించడంతో.. నాలాలో ఇరుక్కుపోయిన ఈ వాటర్ ట్యాంకును బయటికి తీసే పనిలో పడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అందుకే ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలంటు అక్కడికి ప్రజలు కోరుతున్నారు.