
త్రిష సినిమా రంగంలో టాప్ పొజిషన్లో ఉంది . సిద్ధార్ధ్ సరసన నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా టైంలో ఎంత అందంగా కనిపించిందో ..నిన్నగాక మొన్న రిలీజ్ అయిన సినిమాలో కూడా అంతే. అద్భుతంగా నటించింది . అందంగా కనిపించింది. అలాగే ఆమె లేటెస్ట్ ఫోటోస్ ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి . కుర్ర హీరోయిన్ ల లుక్ తో తెగ మెరిసిపోతూ ఉంటుంది త్రిష . "మేడం మీరు ఏం యూస్ చేస్తారు..? ఎందుకు ఇంత అందంగా ఉంటారు..?" అని ఆమె పెట్టే ప్రతి పోస్ట్ కింద కామెంట్స్ కనిపిస్తూనే ఉంటాయి .
అయితే రీసెంట్ గా త్రిష సోషల్ మీడియాలో ఒక క్రేజీ పోస్ట్ పెట్టడానికి ఆన్సర్ ఇచ్చింది. "తనను తాను ప్రేమించుకోవడం జీవితాంతం కొనసాగే ప్రేమ కథకు నాంది" అంటూ ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దానితో పాటు శారీలో అందంగా రెడీ అయిన ఒక ఫోటోని కూడా షేర్ చేసింది. అంటే మనం అందంగా ఉండాలి అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి అని అర్థం వచ్చేలా చెప్పింది . దీంతో సోషల్ మీడియాలో త్రిష పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రేమ గురించి ఇంత చిలక పలుకులు పలుకుతున్నావ్ నువ్వు ప్రేమలో పడ్డావా ఏంటి..? ఈ విధంగా హింట్ ఇస్తున్నావా ఏంటి..? అంటున్నారు కొంతమంది ఫ్యాన్స్. విజయ్ తో త్రిష రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటున్నారు . ఆమె పరోక్షంగా ఈ విధంగా హింట్ ఇచ్చింది అంటూ కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో హీరోయిన్ త్రిష పెట్టిన పోస్ట్ బాగా వైరల్ గా మారింది..!!