కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మధ్య ప్రస్తుతం ఓ హాట్ రూమర్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. చేతులు పట్టుకుని కలిసి తిరగడం, బర్త్ డే పార్టీ స్పెషల్ హంగామా.. ఇలా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న  విషయాలు ఈ గాసిప్స్‌కి మరింత బలం చేకూర్చుతున్నాయి. ఇటీవల మృణాల్ ఠాకూర్ తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా జరుపుకున్నారు. అందులో ముఖ్య అతిథిగా హాజరైన ధనుష్ , ఆమెతో అత్యంత సన్నిహితంగా కనిపించాడు. పార్టీ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్ల ఊహాగానాలకు తెరలేవింది. మృణాల్ చేతిని ప్రేమగా పట్టుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.


ఇప్పటి వరకు ధనుష్ – మృణాల్ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ వీరి మధ్య స్నేహం మాత్రం బలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ జంట దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ రూపొందిస్తున్న "తేరే ఇష్క్ మే" సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య క్లోజ్‌నెస్ పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. షూటింగ్ బ్రేక్‌లో ఇద్దరు గడిపిన ప్రైవేట్ టైం కూడా గాసిప్‌ను ఆవిరి చేస్తోంది. ఇక్కడ మరో ట్విస్టేంటంటే, మృణాల్ స్పాటిఫై అకౌంట్‌లో "మామాస్ ఫేవ్స్" పేరుతో ఓ ప్లేలిస్ట్ కనిపించిందట. అందులోని పాటలు అన్నీ తమిళ సాంగ్స్ అని, అవి ధనుష్ సిఫార్సు చేసినవని నెటిజన్లు గుసగుసలు వినిపిస్తున్నారు. ఫ్యాన్స్ అయితే.. "ఇది ప్రేమకు సైగే" అంటున్నారు.


ఇదే సమయంలో కొన్ని నెలల క్రితం ధనుష్మీనా పెళ్లి వార్తలతో బీభత్సం అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ ప్రచారాన్ని మీనా తీవ్రంగా ఖండించగా, ఇప్పుడు మృణాల్‌తో కొత్త ప్రేమ చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటివరకు ధనుష్ కానీ, మృణాల్ ఠాకూర్ కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ ప్రేమాయణం నిజమా? రూమరా? అనేది చెప్పడం ఇప్పటికీ కష్టమే. కానీ అభిమానులకు మాత్రం ఇది హాట్ టాపిక్. ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సోషల్ మీడియా వేదికల్లోనూ ఈ జంట గురించి చర్చ నడుస్తోంది. అధికారికంగా ఎవరైనా క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటపడేలా లేదు!



మరింత సమాచారం తెలుసుకోండి: