భారతీయ సంస్కృతిలో తోబుట్టువుల ప్రేమకు అద్దం పడే పవిత్ర పండుగ రాఖీ. ఒక్క చిన్న రక్షాబంధనంతోనే ఓ జీవితకాల బంధాన్ని గుర్తుచేస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్రేమ పండుగ కూడా వాస్తు శాస్త్రంతో కలసి ఇంకొంచెం ప్రత్యేకతను సంతరించుకుంటోంది. "పెళ్లిళ్లు పంచాంగాన్ని చూస్తారు కానీ, రాఖీ ఎందుకు కాదు?" అంటున్నారు నిపుణులు. ఇక ఈ వారం రాఖీ పండుగను శాస్త్రీయంగా జరుపుకోవాలనుకుంటున్న వాళ్ల కోసం ఇది ఓ మాస్సీ గైడ్ లాంటిదే! శుభ ముహూర్తం లేకుండా రాఖీ.. నో వే! పెళ్లి పిలుపు లాంటిదే ఇది. వాస్తు ప్రకారం భద్రకాలం మినహాయించి పంచాంగంలో ఉన్న శుభ ముహూర్తంలోనే రాఖీ కట్టాలి. ఉదయం లేదా మధ్యాహ్నం – శుభతర సమయం. ఎందుకంటే భద్ర కాలంలో కట్టిన రాఖీ తలకిందుల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెబుతోంది వాస్తు.


తూర్పు దిశ – శక్తి కేంద్రం ..  రాఖీ క‌ట్టే స‌మ‌యంలో సోదరుడు తూర్పు దిశకు ముఖం పెట్టుకుని కూర్చోవాలి. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. మీ ఇంట్లో పూజామందిరం ఆ దిశలో ఉంటే, అక్కడే కార్యక్రమం జరిపితే మరీ మంచిది.   రాఖీ ప్లేట్ కూడా పవిత్రతకు గుర్తు! ..  అందంగా అలంకరించిన రాఖీ  ప్లేట్  శుభప్రదం. ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంతో ప్రక్కన ప్లేట్‌ను అలంకరించాలి. అందులో రాఖీ, కుంకుమ, గంధం, అక్షతలు, స్వీట్లు, పుష్పాలు ఉండాలి. దీపం వెలిగించి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచితే సానుకూల శక్తులు చుట్టూ కలుగుతాయి. ముడి కుడి చేతికే..! కుడి చేయి కర్మను సూచిస్తుంది. కాబట్టి కుడి మణికట్టుకే రాఖీ కట్టాలి. ముడిని గట్టిగా, ప్రేమగా కట్టాలి. కట్టేటప్పుడు ..

 

"యేన బద్ధో బలీ రాజా, దానవేంద్రో మహాబలః|
తేన త్వా మభిబధ్నామి, రక్షే మా చలమాచల||"

అనే రక్షాబంధన్ మంత్రాన్ని పఠిస్తే, బంధం మరింత బలపడుతుంది.

ముగింపు షుగర్‌తో.. బహుమతితో బెస్ట్ ఫినిష్! రాఖీ కట్టాక సోదరుడు తన సోదరికి స్వీట్లు తినిపించి హారతి ఇవ్వాలి. త‌న శక్తికి తగ్గట్టు బహుమతి ఇవ్వడం ద్వారా ఆమె పట్ల ప్రేమ, శ్రద్ధను చూపాలి. ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఫైనల్‌గా.. రాఖీ అంటే రిటువల్ కాదు – రిలేషన్! వాస్తు ప్రకారం జరుపుకుంటే రాఖీ పండుగ కేవలం సంప్రదాయం కాదు – పాజిటివ్ ఎనర్జీకి ఓ అద్భుతం అవుతుంది! సోదర సోదరీమణుల బంధాన్ని గట్టి చేస్తూ, కుటుంబంలో శాంతి, ఆనందం, శ్రేయస్సును నింపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: