- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా చర్చనీయాంశంగా మారిన అంశం కల్వకుంట్ల కవిత పార్టీ మారుతున్నారన్నది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో సైలెంట్‌గా ఉన్న కవిత, తాజాగా జాగృతి పేరిట రాజకీయంగా మళ్లీ చురుకుగా ఉండ‌డం.. ఆమె కొత్త రాజకీయ ప్ర‌యాణంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆమె కుమార్తె కావడం, గతంలో పార్టీ తరఫున ఎమ్మెల్సీగా సేవలందించిన నేపథ్యం ఉన్నా తాజాగా పార్టీ కార్యక్రమాల్లో కవితకు స్థానం లేకపోవడం గమనార్హం. దీంతో ఆమె పార్టీ మారుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటీవల ఆమె తెలంగాణలో కాకుండా, ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో జాగృతి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో క‌విత జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారా ? అన్న సందేహాలు వ‌స్తున్నాయి. ఈ ఊహాగానాలకు బలాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆమెపై పెండింగ్‌లో ఉన్న లిక్క‌ర్‌ స్కాంలో సీబీఐ, ఈడీ విచారణలు కొనసాగుతుండడం కూడా రాజకీయ భవిష్యత్‌పై పెను ప్రభావం చూపించే అంశంగా మారింది.


కవిత పార్టీ మారతారన్న వార్తలను బీఆర్ఎస్ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆమె పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే ప్రసక్తే లేదని, కేవలం ఓన్ ఇమేజ్ కోస‌మే జాగృతి ఆధ్వర్యంలో కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని అంటున్నారు. కానీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గిపోతున్నందున, మానసికంగా దూరమవుతున్నారని విశ్లేషిస్తున్నారు. ఇక ఇటీవల ఆమెకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులతో క‌లిసిన సందర్భంగా తెరపైకి వచ్చిన వార్తలు, ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న చర్చలకు బలం చేకూర్చాయి. బీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు ఎవరూ కాంగ్రెస్‌లో చేరకపోవడం, కానీ కవిత ఓ హైప్రొఫైల్ నేత‌గా కాంగ్రెస్‌లో ఎంట్రీకి సిద్ధమవుతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా క‌విత బీఆర్ఎస్ ను వీడ‌డం ఖాయం అనే ఎక్కువ మంది అభిప్రాయ ప‌డుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: