- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ )

ఇండియన్ యానిమేషన్ సినిమాల చరిత్రలో మరో ఘన విజయాన్ని సాధించిన సినిమా ‘ మహావతార్ నరసింహ ’. భగవంతుడు శ్రీహరిలో శ్రీవిష్ణువు తీసుకున్న దశావతారాల్లో అత్యంత శక్తివంతమైన అవతారంగా భావించబడే నరసింహ స్వరూపం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు అశ్విన్ కుమార్ సాంకేతికంగా, విజువల్‌గా అత్యంత భిన్నంగా రూపొందించిన ఈ సినిమాకు మొదటి నుంచి భారీ అంచనాలే నెలకొన్నాయి.సినిమా రిలీజ్‌కు ముందు చిన్నగా ప్రమోషన్ మొదలైనా... విడుదలైన కొద్ది రోజులలోనే ఈ యానిమేషన్ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హిందీ మార్కెట్‌లో అయితే ఈ సినిమాకు అద్భుత స్పందన లభిస్తోంది. సాధారణంగా చాలా సినిమాలు రెండో వారం మొదలయ్యేసరికి బాక్సాఫీస్ వద్ద తక్కువ కలెక్షన్లతో నిలిచిపోతుంటాయి. కానీ ‘మహావతార్ నరసింహ’ మాత్రం రెండో సోమవారం కూడా అదే జోష్‌ను కొనసాగిస్తూ, ఒక్క హిందీ వెర్షన్‌లోనే రూ. 5 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.


ఈ రోజు మంగళవారం కూడా ప్రతి గంటకు 10,000 టికెట్లు పైగా అమ్ముడవుతుండటం విశేషం. ఇది సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని తెలుపుతోంది. ముఖ్యంగా, టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ లో "హౌస్‌ఫుల్" బోర్డులు పెడుతున్నారు. మెజారిటీ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ పీక్స్ కు చేరాయి. భక్తి, యానిమేషన్, మైథలాజికల్ సమ్మేళనంతో తెరకెక్కిన ఈ సినిమా పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు కలెక్షన్లను దాటేసింది. ప్రస్తుతం సినిమాకు ఉన్న క్రేజ్, ఇంకా నడుస్తున్న రన్ ను బట్టి చూస్తే 'మహావతార్ నరసింహ' త్వరలోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాక, ఇండియన్ యానిమేషన్ సినిమాలకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనిపిస్తోంది. ఇప్పటి వరకు భారతదేశంలో యానిమేషన్ సినిమాలకు లభించని ఆదరణను ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషం. హై క్వాలిటీ గ్రాఫిక్స్, భావోద్వేగభరితమైన కథనంతో పాటు, పవర్‌ఫుల్ డైలాగ్స్, దేవతల వైభవాన్ని గొప్పగా చూపించిన విధానం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: