
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా ఆగస్ట్ 14నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 'వార్ 2' సినిమా ఇప్పటికే భారీ అంచనాలను పెంచింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది.
యాక్షన్ సన్నివేశాలు, భారీ విజువల్స్ ఆకట్టుకున్నప్పటికీ, కథ విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ లేదని కొంతమంది అభిప్రాయపడ్డారు. మరోవైపు, 'కూలీ' సినిమా ట్రైలర్ కూడా అభిమానుల నుంచి మిశ్రమ స్పందనను పొందింది. ఈ రెండు సినిమాలకు థియేటర్లలో ఏకగ్రీవమైన పాజిటివ్ టాక్ వస్తేనే, బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ రెండు సినిమాల విడుదల ఒకే రోజున ఉండటంతో, అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పోటాపోటీ చర్చలు జరుగుతున్నాయి. ఎవరు విజయం సాధిస్తారనేది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు