ఏంటి ధనుష్హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నారా.. ఇది నిజమేనా..ఇన్ని రోజులు మీనాతో లింకప్ చేస్తూ వార్తలు వినిపించాయి. కానీ సడన్గా కొత్త హీరోయిన్ ని పట్టారే అంటూ సోషల్ మీడియాలో ధనుష్ పై ట్రోలింగ్ జరుగుతుంది. మరి ఇంతకీ ధనుష్హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నారు.. నిజంగానే ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కోలీవుడ్ నటుడు ధనుష్ ఈ మధ్యనే కుబేర మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలన హిట్ అందుకున్నారు. ఈ సినిమా జోష్ తో ఆయన మరిన్ని సినిమాలు ఓకే చేశారు. ఇప్పటికే ధనుష్ నిత్యమీనన్ కాంబోలో వస్తున్న ఇడ్లీ కడై మూవీ షూటింగ్ దశలో ఉంది ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే.. ఓ హీరోయిన్ తో ధనుష్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. అయితే ధనుష్ మృణాల్ ఠాకూర్ కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ అలాంటిది వీరి మధ్య ఇంత మంచి సాన్నిహిత్యం ఉండడం ఏంటి అని వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు చూసి చాలా మంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా రీసెంట్గా జరిగిన మృణాల్ ఠాకూర్ బర్త్డే వేడుకల్లో ధనుష్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. అందరిలో ధనుష్ స్పెషల్గా కనిపించడంతో ఇదేంటి  మృణాల్ ఠాకూర్ బర్త్డేకి ధనుష్ వచ్చారు.. అసలు వీరిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. అలాంటిది వీరిద్దరూ కలిసి బర్త్డేలు చేసుకుంటున్నారేంటి అని మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ బయట కూడా చాలా సన్నిహితంగా కలిసి కనిపించడంతోపాటు డేటింగ్ వార్తలకు ఊతమిస్తూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కనిపించడం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

అంతేకాదు అసలు మృణాల్ ఠాకూర్ కి సంబంధం లేని ఒక పార్టీకి కూడా ధనుష్ పిలిచాడని వెళ్ళినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ధనుష్ మృణాల్ ఠాకూర్ వార్తలు ప్రస్తుతం కోలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి. వీరిద్దరూ ఎందుకు ఇంత క్లోజ్ గా తిరుగుతున్నారు.. నిజంగానే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారా అంటూ మాట్లాడుకుంటున్నారు.ఇక మరి కొంతమందేమో మృణాల్ ఠాకూర్ ధనుష్ కాంబోలో నెక్స్ట్ ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారు కావచ్చు..అందుకే వీరిద్దరూ కలిసి తిరుగుతున్నారని మాట్లాడుకుంటున్నారు. మరి వీరిద్దరి మధ్య ఉన్న ఆ రహస్య బంధం ఏంటో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పితే కానీ బయటపడదు. ఇక ధనుష్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకులు పుట్టాక 18 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: